✕
Kriti Sanon : రామకథలతో శాలువా..! ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కృతి సనన్
By EhatvPublished on 14 Jun 2023 6:11 AM GMT
రామాయణ కథను ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తుంది. అందుకే ఆ ఇతివృత్తంతో తీసిన సినిమాలన్నీ విజయవంతం అయ్యాయి. ఆ కారణంగానే ఆదిపురుష్ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

x
Kriti Sanon
-
- రామాయణ కథను ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తుంది. అందుకే ఆ ఇతివృత్తంతో తీసిన సినిమాలన్నీ విజయవంతం అయ్యాయి. ఆ కారణంగానే ఆదిపురుష్ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
-
- ప్రమోషన్స్‌లో సీతమ్మ పాత్రను పోషిస్తున్న కృతి సనన్ తన అందంతో అందరినీ కట్టిపడేస్తున్నారు. అభిమానులను అలరిస్తున్నారు.
-
- ప్రచార కార్యక్రమంలో అయోధ్య కథలతో రూపొందించిన శాలువను ధరించిన కృతి హైలైట్‌గా నిలిచారు. కృతి సనన్ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ ఇన్‌స్టా హ్యాండిల్లో దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
-
- ప్రత్యేకంగా సుకృతి అండ్ ఆకృతి బ్రాండ్ ప్రత్యేకంగా రూపొందించిన అయోధ్య కథల శాలువా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
-
- రామాయణం ప్రేరణగా నిలిచిన ఈ శాలువాను తయారుచేయడానికి రెండేళ్లు పట్టిందట. ఈ శాలువాను ఇంత అందంగా, ఇంత మనోహరంగా తీర్చి దిద్దడానికి ఆరు వేల గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందట.
-
- రామాయణంలోని పంచవటి, స్వయంవరం, అశోకవనం, రామ్ దర్బార్లోని నాలుగు సన్నివేశాలు ఇందులో కూర్చారు. పాషా, చోకర్స్, కడా లాంటి స్టేట్మెంట్ నగలతో అద్భుతమైన అనార్కలిలో అచ్చంగా అప్సరసలా మెరిసిపోతున్నది.

Ehatv
Next Story