ఆదిపురుష్(Adipurush) సినిమాలో సీతగా మెప్పించిన కృతిసనన్‌కు(Kriti Sanon) బ్రహ్మండమైన ఆఫర్ వచ్చింది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటి మీనా కుమారి(Meena Kumari) జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మీనా కుమారి పాత్రను కృతిసనన్ పోషించబోతున్నారు. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా(Manish Malhotra) ఈ బయోపిక్ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Meena Kumari Biopic
ఆదిపురుష్(Adipurush) సినిమాలో సీతగా మెప్పించిన కృతిసనన్‌కు(Kriti Sanon) బ్రహ్మండమైన ఆఫర్ వచ్చింది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటి మీనా కుమారి(Meena Kumari) జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మీనా కుమారి పాత్రను కృతిసనన్ పోషించబోతున్నారు. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా(Manish Malhotra) ఈ బయోపిక్ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో మనీష్ మల్హోత్రా బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని చెబుతున్నారు.
బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్‌గా పేరు పొందిన మీనా కుమారి 33 ఏళ్ల కెరీర్‌లో దాదాపు తొంభై చిత్రాల్లో నటించారు. 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. మహానటి సావిత్రికి(Savitri) మీనా కుమారి జీవితం దాదాపుగా ఒకే రకంగా ముగిశాయి. ఇద్దరూ గొప్ప నటీమణులే! మీనా కుమారి చేసిన పాత్రలను తెలుగులో సావిత్రి వేశారు కూడా! పాకీజా(Pakija), సాహబ్ బీబీ ఔర్ గులామ్(Sahab Bibi Aur Ghulam) సినిమాలలో ఆమె నటన అద్భుతం. మొదట్లో ధర్మేంద్రతో(Dharmendra) సాగిన ప్రేమ విఫలం కావడంతో నిరాశలో కూరుకుపోయారు.
తర్వాత దర్శక నిర్మాత కమల్ అమ్రోహిని(Amrohi) పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహబంధం కూడా కొన్నాళ్ల పాటే సాగింది. మీనా కుమారి అసలు పేరు మహజబిన్ బానో(Mahzabin Bano). 1952లో విడుదలైన బైజా బావరా చిత్రంలో ఆమె గౌరి పాత్రలో జీవించారు. ఆమె జీవితమంతా విషాదమే! అందుకే ఆమెను ట్రాజడీ క్వీన్ అంటారు. పాకీజా విడుదలైన మూడు వారాల తర్వాత మీనాకు లివర్ సిర్రోసిన్ నిర్ధారణ అయ్యింది.
1972, మార్చి 31న ఆమె చనిపోయారు. ఆమె మంచి రచయిత్రి కూడా! ఉర్దూలో ఆమె రాసిన కవిత్వాలకు సంగీత దర్శకుడు ఖయ్యామ్(Khayam) అద్భుతమైన స్వరాలను సమకూర్చారు. మీనా కుమారినే స్వయంగా ఆలపించారు. అంతటి మహోన్నతమైన నటి పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నానని కృతిసనన్ అన్నారు. మహానటిలో సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్‌కు ఎంతటి పేరు వచ్చిందో కృతి సనన్‌కు కూడా అంతటి పేరు ప్రఖ్యాతులు రావొచ్చు. వస్తే మాత్రం అది మీనాకుమార గొప్పతనమే అవుతుంది.
