టాప్‌ లెవల్లోకి దూసుకెళ్లిన నటీనటులందరి జీవితం పూల పాన్పు కాదనీ, వాళ్ల నట జీవితంలో ఎన్నో కొన్ని చేదు సంఘటనలు ఉండే ఉంటాయని సీనియర్‌ హీరోయిన్‌ కృతి సనన్‌(Kriti Sanon) అంటున్నారు. గులాబీపూల నీడలలో ముళ్లున్నట్టే ప్రతి ఒక్కరి కెరీర్‌లో ముళ్లు కూడా ఉంటాయని అన్నారు. కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన ఓ ఇబ్బందికర సంఘటన గురించి చెప్పుకొచ్చారు. 'నేను ముంబయికి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన అది. అప్పుడు మోడలింగ్‌(Model) చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా.

నా అదృష్టంకొద్దీ ఒకేసారి వన్‌: నేనొక్కడినే(1-nenokadine), హీరోపంతీ(Heropanthi) అనే రెండు సినిమాల్లో హీరోయిన్‌గా ఎంపికయ్యాను. ఇంకొద్దిరోజుల్లో చిత్రీకరణ మొదలు కావాల్సి ఉంది. ఈలోగా మొదటిసారి ఒక ర్యాంప్‌ షోలో(Ramp Show) పాల్గొనడానికి వెళ్లాను. పచ్చికలా ఉన్న లాన్‌లో క్యాట్‌వాక్‌ చేస్తున్నా. ఉన్నట్టుండి నేను వేసుక్ను హీల్స్‌ మడమలు నేలలో దిగబడిపోయాయి. దీంతో గందరగోళానికి లోనయ్యాను.

మధ్యలోనే ఆగిపోయాను. ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ వెంటనే గట్టిగా అరిచేసింది. దాదాపు యాభై మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ పక్కకి వెళ్లిపోయి చాలాసేపు ఏడ్చాను. జీవితంలో ఆమెతో మళ్లీ కలిసి పని చేయలేదు’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు కృతి సనన్‌.

ఆ చేదు అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేనని చెప్పారు.
ఆ సంఘటన తర్వాత మరింత ధృడ సంకల్పంతో ఇండస్ట్రీలో ప్రయత్నాలు ప్రారంభించానని, విజయాలతోనే అలాంటి వారికి బుద్ధి చెప్పాలనుకున్నానని తెలిపారు. 'ఇప్పుడు నా టైమ్‌ వచ్చింది. నాడు విమర్శించిన వారే ఇప్పుడు అభినందనలు తెలుపుతున్నారు. నా దృష్టిలో అదే నిజమైన విజయం’ అని పేర్కొన్నారు కృతి.
ప్రస్తుతం కృతి సనన్‌ టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి గణపత్‌: పార్ట్‌వన్‌లో నటిస్తున్నారు.

Updated On 6 Sep 2023 12:03 AM GMT
Ehatv

Ehatv

Next Story