బాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో కృతి సనన్ ఒకరు. తాజాగా ఆమె 'ఆదిపురుఫ్'లో 'జానకి' పాత్రలో కనిపించింది. ఆమె ప్రస్తుతం సినీ పరిశ్రమలో శాశ్వతంగా నిలదొక్కుకునే దిశగా అడుగులు వేసింది. కృతి నటి నుండి నిర్మాతగా మారింది. ఈ వార్తను కృతి స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

Kriti Sanon Launches Own Production House Blue Butterfly Films Adipurush Actress Shares
బాలీవుడ్(Bollywood) టాప్ హీరోయిన్(Top Heroin)లలో కృతి సనన్(Kriti Sanon) ఒకరు. తాజాగా ఆమె 'ఆదిపురుష్'లో 'జానకి' పాత్రలో కనిపించింది. ఆమె ప్రస్తుతం సినీ పరిశ్రమలో శాశ్వతంగా నిలదొక్కుకునే దిశగా అడుగులు వేసింది. కృతి నటి నుండి నిర్మాత(Producer)గా మారింది. ఈ వార్తను కృతి స్వయంగా తన సోషల్ మీడియా(Social Media) అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్(Instsgram)లో కృతి ఒక వీడియోను పంచుకుంది. తాను ఫిల్మ్ మేకర్(Film Maker)గా కూడా తన కెరీర్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. కృతి తన ప్రొడక్షన్ హౌస్ టీజర్(Teaser)ను షేర్ చేసింది.
నిర్మాతగా మారుతున్నందుకు, కొత్త ప్రాజెక్ట్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నానని.. గేర్ మార్చాల్సిన సమయం ఆసన్నమైందని కృతి రాసుకొచ్చింది. నేను ఈ మాయా పరిశ్రమలో తొమ్మిదేళ్లుగా నా కలను జీవిస్తున్నాను. నేను ఈ రోజు నటిగా మారడానికి చిన్న అడుగులు వేసాను, నేర్చుకున్నాను, అభివృద్ధి చెందాను. నేర్చుకున్నాను. సినిమా మేకింగ్(Film Making)లోని ప్రతి అంశం నాకు చాలా ఇష్టం అని పేర్కొంది. మీ హృదయాన్ని, నా హృదయాన్ని తాకే మరిన్ని కథలు చెప్పే సమయం ఆసన్నమైంది. ఎట్టకేలకు పెద్ద మనసుతో, పెద్ద కలలతో 'బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్'(Blue Butterfly Films)ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నానని వెల్లడించింది. కృతి పోస్ట్ కు ఆమె అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కృతి సనన్ ప్రస్తుతం షాహిద్ కపూర్(Shahid Kapoor) కొత్త చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమా పేరును ప్రకటించలేదు. రాజ్‌కుమార్ రావ్(Rajkumar Rao)తో 'భేడియా 2', గణపత్: పార్ట్ వన్, 'సెకండ్ ఇన్నింగ్స్'లో కనిపించనుంది.
