టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత అదే స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మనకు తెలియకుండా మనల్ని కెమెరాలు వెంటాడుతుంటాయి. సెలెబ్రిటీలకు ఇలాంటి తలనొప్పులు ఇంకెక్కువగా ఉంటాయి. హోటల్‌లో వాళ్లు బస చేసినప్పుడు ఒకటికి రెండుసార్లు గదలను చెక్ చేసుకోవడం మంచిది. తీన్‌మార్‌లో(Theenmar) నటించిన కృతి కర్బందాకు(Kriti Kharbanda) గతంలో ఇలాంటి సంఘటనే ఎదురయ్యిందట! తన హోటల్ గదిలో ఓసారి సీక్రెట్ కెమెరాను(Secrete Camera) గుర్తించానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెనే చెప్పుకొచ్చారు.

Kriti Kharbanda
టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత అదే స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మనకు తెలియకుండా మనల్ని కెమెరాలు వెంటాడుతుంటాయి. సెలెబ్రిటీలకు ఇలాంటి తలనొప్పులు ఇంకెక్కువగా ఉంటాయి. హోటల్‌లో వాళ్లు బస చేసినప్పుడు ఒకటికి రెండుసార్లు గదలను చెక్ చేసుకోవడం మంచిది. తీన్‌మార్‌లో(Theenmar) నటించిన కృతి కర్బందాకు(Kriti Kharbanda) గతంలో ఇలాంటి సంఘటనే ఎదురయ్యిందట! తన హోటల్ గదిలో ఓసారి సీక్రెట్ కెమెరాను(Secrete Camera) గుర్తించానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెనే చెప్పుకొచ్చారు. ఆ కెమెరా చూసి తాను చాలా భయపడ్డానని అన్నారు. 'నేను నటించిన ఓ కన్నడ సినిమా షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. హోటల్‌లో పనిచేసే ఒక వ్యక్తి నా రూమ్‌లో సీక్రెట్‌గా కెమెరా పెట్టాడు. బస చేసే రూమ్‌ను తరచూ చెక్ చేసుకోవడం నాకూ, నా బృందానికీ అలవాటు. అలా, నా రూమ్‌లో కెమెరాని గుర్తించాం. సెట్ అప్ బాక్స్ వెనుక అతడు ఉంచిన కెమెరాని చూసి షాకయ్యా. బయట ఎక్కడైనా బస చేయాల్సి వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా’’ అని కృతి కర్బంద అన్నారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(Pawan kalyan) నటించిన తీన్‌మార్‌తో కృతి కర్బంద తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. తర్వాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త వంటి తెలుగు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
