ఉప్పెన(Uppena) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మంగళూరు అమ్మాయి కృతిషెట్టి(Krithi Shetty). ఈ సినిమాతో బేబమ్మగా కుర్రకారు గుండెల్లో స్థిరపడిపోయింది. సినిమా హిట్టవ్వడంతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఊహించని పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా విజయవంతమయ్యాయి.
ఉప్పెన(Uppena) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మంగళూరు అమ్మాయి కృతిషెట్టి(Krithi Shetty). ఈ సినిమాతో బేబమ్మగా కుర్రకారు గుండెల్లో స్థిరపడిపోయింది. సినిమా హిట్టవ్వడంతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఊహించని పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. దాంతో సహజంగానే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. డిమాండ్ కూడా పెరిగింది. ఆ తర్వాత వరుస ఫ్లాపులు కృతి కెరీర్‌కు ఇబ్బందులు కలిగించాయి. ఆమె నటించిన నాలుగు సినిమాలు డిజాస్టరయ్యాయి. అసలే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృతిషెట్టి ట్రోలింగ్ పేరిట విమర్శలు ఎదుర్కొంటోంది.
ఈ మధ్య కృతిషెట్టి మొహంలో మార్పులు కనిపిస్తున్నాయని, అందం మెరుగుపడేందుకు ఆమె ప్లాస్టిక్ సర్జరీ(Platic surgery) చేయించుకుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ వదంతులేనని, ఇందులో ఏ మాత్రం నిజం లేదని కృతి షెట్టి క్లారిఫై ఇచ్చింది. ఇలాంటివి ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో కూడా అర్థం కావడం లేదంది. మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయని, ఇలాంటి పుకార్లు విన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందని, ఉప్పెనలో ఉన్నట్టు ఇప్పుడు లేనని ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 'అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా...ఫీచర్స్ మారుతాయి. అందరిలా నేను కూడా. కొన్నిసార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రానా ప్లాస్టిక్ సర్జరీ అంటారా"? అంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చింది కృతి షెట్టి.