ఉప్పెన సినిమా(Uppena)తో టాలీవుడ్ పై ఉప్పెనలా ఎగసిపడింది హీరోయిన్ కృతి శెట్టి. ఆతరువాత వరుసగా మూడు సినిమాల సక్సెస్ త హ్యాట్రిక్ కొట్టి.. ఆతరువాత కూడా ఓ సినిమా సూపర్ హిట్ కొట్టి.. ఏకంగా నాలుగుసినిమాల సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. ఆతరువా ఏమందోఏమో కాని.. వరుసగా ప్లాప్ లు పలుకరించాయి కృతి శెట్టిని.. వరుసగా ఏకంగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఫెయిల్యూర్ ను కూడా మూటగట్టుకుంది కన్నడ కస్తూరి.

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty). ప్రస్తుతం ఆఫర్లు లేక అల్లాడుతున్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ దర్శకుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఉప్పెన సినిమా(Uppena)తో టాలీవుడ్ పై ఉప్పెనలా ఎగసిపడింది హీరోయిన్ కృతి శెట్టి. ఆతరువాత వరుసగా మూడు సినిమాల సక్సెస్ త హ్యాట్రిక్ కొట్టి.. ఆతరువాత కూడా ఓ సినిమా సూపర్ హిట్ కొట్టి.. ఏకంగా నాలుగుసినిమాల సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. ఆతరువా ఏమందోఏమో కాని.. వరుసగా ప్లాప్ లు పలుకరించాయి కృతి శెట్టిని.. వరుసగా ఏకంగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఫెయిల్యూర్ ను కూడా మూటగట్టుకుంది కన్నడ కస్తూరి. ఇక రీసెంట్ గా నాగచైతన్య హీరోగా వచ్చిన కష్టడీ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది బ్యూటీ.. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం చూస్తుంది కాని.. అవకాశాలే ఆమెకు అందడం లేదు. హిట్ అన్న పదానికి ఆయడ దూరంగా వెళ్లిపోయింది కృతి శెట్టి. ఇక రీసెంట్ గా తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కృతి శెట్టి.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఓ సినిమా షూటింగ్ లో ఎదురైన చిత్ర విచ్రమైన అనుభవాన్ని పంచుకుంది బ్యూటీ.
ఓ స్టార్ డైరెక్టర్ కారణంగా తాను ఇబ్బంది పడ్డట్లు తెలిపింది బేబమ్మ. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా మాతృభాష తుళు.. అయితే తెలుగు సినిమాలు చేయడం మూలంగా తెలుగు బాగానే మాట్లాడతాను. కాని నాకు తమిళం అస్సలు రాదు..నేను ఇప్పటి వరకూ పనిచేసింది కూడా తెలుగు దర్శకులతోనే. కాని ఫస్ట్ టౌమ్ ది వారియర్ మూవీ చేస్తున్నప్పుడు.. తమిళ దర్శకుడితో పని చేశాను ఆ సినిమా దర్శకుడు లింగుసామిగారికి తెలుగు వచ్చు కాని.. ఆయన తెలుగులో తమిళ యాస కలుస్తుంది. దాంతో తమిళ్ మిక్సింగ్ లో తెలుగు అర్ధం అయ్యేది కాదు.

దాంతో చాలా ఇబ్బంది పడ్డాను అంటోంది కృతీ శెట్టి.. ఇలా వారం రోజులు పట్టింది.. దర్శకుడిని అర్ధం చేసుకోవడం కోసం. అటుహీరో రామ్ కి మాత్రం తమిళ్ బాగా వస్తుంద కాబట్టి ఏం పర్వాలేదు. కాని నాపరిస్థితి మాత్రం ధారుణం అయ్యింది. ఇక ఆతువాత నుంచి రామ్ సహాయం తీసుకుని షూటింగ్ కంప్లీట్ చేశానంటోంది బ్యూటీ.

ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే యూజ్ చేసుకుంటోంది. వరుసగా ఆఫర్లు సాధించింది. కాని ప్రస్తుంతం సినిమాలు తగ్గడంతో సోషల్ మీడియాలో ఇమేజ్ పెంచుకునే పనిలో పడింది. అయితే తమిళంలో స్టార్ హీరో విజయ్ పక్కన ఛాన్స్ కొట్టేసిందట కృతి మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

Updated On 5 Jun 2023 2:04 AM GMT
Ehatv

Ehatv

Next Story