సత్యదేవ్ ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసాడు. విమర్శకులు కూడా అతని నటనను మెచ్చుకున్నారు

సినిమా థియేటర్లకు పెద్దగా కలెక్షన్స్ రావడం లేదని యజమానులు బాధపడుతూ ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది చిన్న సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తాయి. థియేటర్లకు వెళ్లడం ఎందుకు అని భావిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కొన్ని సినిమాలు నెల లోపే ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. తాజాగా వారం లోపే ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ'. సినిమా బాగుందనే ప్రశంసలు దక్కినప్పటికీ.. ఎన్నికల కారణంగా పెద్దగా ప్రజలు థియేటర్లకు వెళ్ళడానికి ఆసక్తి చూపించలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో సినిమా థియేటర్లలో రన్ అవుతూ ఉంది. అయినా కూడా ఓటీటీలోకి వచ్చేసింది.

బాక్సాఫీస్ వద్ద సినిమా పనితీరు చాలా దారుణంగా ఉందని చెబుతున్నారు. సత్యదేవ్ ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసాడు. విమర్శకులు కూడా అతని నటనను మెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ సమయంలో ఓటీటీలో మరే తెలుగు సినిమా రాలేదు. లక్ష్మణ్ మీసాల, కృష్ణ, అర్చన, రఘు కుంచె, నందగోపాల్ కీలక పాత్రలు పోషించారు. కాల భైరవ స్వరాలు సమకూర్చారు. దర్శకుడు వి.వి. గోపాలకృష్ణ, కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Updated On 16 May 2024 9:54 PM GMT
Yagnik

Yagnik

Next Story