హరిహర వీరమల్లు (Harahara veeramallu) సినిమా టీజర్ రిలీజయ్యింది. టీజర్ విడుదల సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా వచ్చాయి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా నుంచి దర్శకుడు క్రిష్ (Director Krish) తప్పుకున్నాడంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో మోత మోగుతోంది. అది నిజమేనని ఇప్పుడు తెలిసింది. క్రిష్ తప్పుకున్నాడంటూ సినిమా యూనిటే స్పష్టం చేసింది.

harahara-compressed
హరిహర వీరమల్లు (Harahara veeramallu) సినిమా టీజర్ రిలీజయ్యింది. టీజర్ విడుదల సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా వచ్చాయి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా నుంచి దర్శకుడు క్రిష్ (Director Krish) తప్పుకున్నాడంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో మోత మోగుతోంది. అది నిజమేనని ఇప్పుడు తెలిసింది. క్రిష్ తప్పుకున్నాడంటూ సినిమా యూనిటే స్పష్టం చేసింది. అతడి స్థానంలో కొత్త దర్శకుడు వచ్చి చేరాడు. ఇతడు మాత్రం ఎన్ని రీళ్ల పాటు ఉండాటో తెలియదు. టీజర్ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన హరిహర వీరమల్లు పోస్టర్‌లో ఎక్కడా దర్శకుడి పేరు లేదు. అప్పుడే చాలా మందికి డౌటొచ్చేసింది. ఇప్పుడా డౌట్ నిజమయ్యింది. ఇవాళ రిలీజైన టీజర్లో దర్శకుడి టైటిల్ కార్డు దగ్గర ఇద్దరి పేర్లు కనిపించాయి. క్రిష్ జాగర్లమూడి పేరుతో పాటు జ్యోతికృష్ణ (Jyothi Krishna) పేరు కూడా కనిపించింది. హరిహర వీరమల్లు మిగతా భాగమంతా జ్యోతికృష్ణ తీస్తాడన్నమాట! ఈ సినిమా కొన్నేళ్లుగా సెట్స్‌పై నడుస్తూనే ఉంది. ఈ ఆలస్యాన్ని భరించలేకే అర్జున్ రాంపాల్ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు క్రిష్ కూడా వైదొలిగాడు. పోనీ ఎన్నికలయ్యాక అయినా పవన్ ఈ సినిమాకు డైట్స్ ఇస్తాడా అంటే అదీ అనుమానమే! ఎందుకంటే దీని కంటే ముందు ఓజీ సినిమాను కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్ (Usthad Bhagathsing) పూర్తి చేయాలి. ఇప్పటికే ఓజీ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఓ 20 రోజుల పాటు పవన్ కాల్షీట్లు ఇస్తే అయిపోతుందట! మరి పవన్ ఇస్తాడా ఇవ్వడా అన్న విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి ఓజీ సెప్టెంబర్‌లో రావడం అనుమానమే! ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేస్తామంటున్నారు. ఇది కూడా డౌటే! అయితే ఈ సినిమాను రెండు భాగాలు చేశారు. ఇప్పటి వరకు షూట్ చేసిన ఫుటేజ్‌తో మొదటి భాగం విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 17వ శతాబ్దం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగానికి స్వార్డ్ వెర్సెస్ స్పిరిట్ అనే పేరు పెట్టారు. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ కూడా తగిలించారు. రెండో భాగం మొత్తానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు.
