ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్, బడ్జెట్ సమస్యలు, పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్‌మెంట్స్ కారణంగా ఇప్పుడు సినిమా పూర్తవ్వడం
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు ప్రాజెక్టులు సెట్స్ మీద ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పూర్తీ సమయాన్ని కేటాయిస్తూ ఉండడం.. 2024 అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ సినిమా షూటింగ్ లకు ఆయన హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో ఆ ప్రాజెక్టులనే నమ్ముకున్న వాళ్లు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ రవితేజతో ప్రాజెక్టుకు కమిట్ అయిపోయారు. అయితే ఇప్పుడు 'హరి హర వీరమల్లు' సినిమా నుండి దర్శకుడు క్రిష్ కూడా బయటకు వచ్చేసినట్లు చర్చ జరుగుతూ ఉంది.
పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిత్రం 2020 లో సెట్స్ పైకి వెళ్ళింది. అప్పటి నుండి సినిమా షూటింగ్ పెద్దగా ముందుకు సాగలేదు. కొన్ని తెరవెనుక వీడియోలు, పవన్ కళ్యాణ్ పోరాట శిక్షణ వీడియోలను మేకర్స్ కొంతకాలం క్రితం విడుదల చేశారు. అయితే ఆ తర్వాత పూర్తి సైలెంట్ అయిపోయింది చిత్ర యూనిట్. మొదట్లో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా అనేక సమస్యల కారణంగా షూటింగ్‌కి ఆటంకాలు ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్ అందించిన తేదీలలో క్రిష్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడంలో విఫలమయ్యాడని కూడా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాలోని కొన్ని సీన్ల విషయంలో అసంతృప్తితో ఉన్నారని, వారు దానిని కూడా రీషూట్ చేశారని సమాచారం. ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్, బడ్జెట్ సమస్యలు, పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్‌మెంట్స్ కారణంగా ఇప్పుడు సినిమా పూర్తవ్వడం ఆలస్యం అవుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎ.ఎం.రత్నం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించినట్లు తెలుస్తోంది. UV క్రియేషన్ బ్యానర్‌లో అనుష్క శెట్టితో ఒక చిత్రాన్ని ప్రారంభించాడని తెలుస్తోంది. హరి హర వీర మల్లులోకి మళ్లీ క్రిష్ చేరే అవకాశం ఉందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.