టాలీవుడ్‌ను డ్రగ్స్‌ వ్యవహారం మరోసారి కుదిపేస్తోంది. డ్రగ్స్‌ కేసులో కేపీ చౌదరి(KP Chaudhary) అరెస్ట్‌ కావడంతో టాలీవుడ్‌లోని కొందరు కలవరపడ్డారు. చౌదరిని విచారించిన పోలీసులు అతడి కాల్‌లిస్ట్‌లో చాలా మంది సినీ ప్రముఖుల పేర్లను గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో ప్రముఖులు ఉలిక్కిపడ్డారు. ఈ లిస్టులో ప్రముఖంగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటి ఆషు రెడ్డి(Ashu Reddy)తో పాటు నటి జ్యోతి(Jyothi), సురేఖా వాణి (Surekha Vani) పేర్లు బయటకు వచ్చాయి.

టాలీవుడ్‌ను డ్రగ్స్‌ వ్యవహారం మరోసారి కుదిపేస్తోంది. డ్రగ్స్‌ కేసులో కేపీ చౌదరి(KP Chaudhary) అరెస్ట్‌ కావడంతో టాలీవుడ్‌లోని కొందరు కలవరపడ్డారు. చౌదరిని విచారించిన పోలీసులు అతడి కాల్‌లిస్ట్‌లో చాలా మంది సినీ ప్రముఖుల పేర్లను గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో ప్రముఖులు ఉలిక్కిపడ్డారు. ఈ లిస్టులో ప్రముఖంగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటి ఆషు రెడ్డి(Ashu Reddy)తో పాటు నటి జ్యోతి(Jyothi), సురేఖా వాణి (Surekha Vani) పేర్లు బయటకు వచ్చాయి. వీరు కే.పీ.చౌదరితో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వెబ్‌సైట్లలో కథనాలు కూడా వచ్చాయి. తమకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ నటి సురేఖ వాణి, జ్యోతితో పాటు ఆషూ రెడ్డి కూడా ఇది వరకే చెప్పుకొచ్చారు. అయినప్పటికీ పలు యూ ట్యూబ్‌ ఛానెల్స్‌ వారి పేర్లను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. దీనివల్ల తాము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆషూ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వీడియోలో తన మనోవేదనను తెలిపారు. 'నేను ఇప్పటికే ఈ డ్రగ్స్‌ కేసుతో సంబంధం లేదని చెప్పాను. కె.పి.చౌదరితో కొన్ని వందల ఫోన్‌ కాల్స్‌ మాట్లాడినట్టు ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. నా దగ్గర కూడా కాల్‌ డేటా ఉంది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల కారణంగా రెండు రోజుల నుంచి మెంటల్‌ టార్చర్‌ అనుభవిస్తున్నాను. ఈ కేసులో నా పాత్ర లేకున్నా కొందరు వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంతే కాకుండా పలు యూ ట్యూబ్‌ ఛానెల్స్‌ నా వ్యక్తిగత నెంబర్‌ను డిస్‌ప్లే చేశాయి. దాంతో కొన్ని వందల ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి. ఏమీ చేయలేక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాను. రెండు నెలలుగా షూటింగ్‌ పనిమీద ఇతర దేశాలలోనే ఉన్నాను. దయచేసి మాకు కూడా కెరీర్‌ ఉందని గమనించండి. ఇకనైనా తప్పుడు వార్తలు ప్రసారం చేయకండి' అని ఆషూ రెడ్డి తెలిపారు.

Updated On 27 Jun 2023 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story