ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం రూమర్స్‌తో నిండిపోయింది. అయితే వాటిలో కొన్ని మితిమీరడంతోపాటు ఎదుటివాళ్లను నొచ్చుకునేలా చేస్తున్నాయి. తాజాగా వచ్చిన రూమర్ ఏంటంటే సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇక లేరని, ఆయన చనిపోయారని రూమర్స్ క్రియేట్ చేశారు.

ఈ నేపథ్యంలో పాపం ఆయన స్పందించి ఓ వీడియో రిలీజ్ చేశారు. ముందుగా ఆయన ‘‘ అందరికీ ఉగాది (Ugadi) పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. నేను ఇంకా చనిపోలేదు, నేను బాగానే ఉన్నాను అని.. పొద్దున్నే చాలా కాల్స్ వచ్చాయని, అన్నికంటే ఆశ్చర్యం ఏంటంటే బందోబస్తు కోసం పోలీసుల వాహనం కూడా వచ్చిందని’’ చెప్పుకుని బాధపడ్డారు.
ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్టు సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు ( Kota Srinivasa Rao) వీడియోలో తెలిపారు. మరోవైపు తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు.. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దని ఆయన కోరారు. ఇక ఆయన రిలీజ్ చేసిన వీడియో ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది.