యంగ్ టైగర్ ఎన్టీఆర్...బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మరోసారి భారీ యాక్షన్ సీక్వెన్స్ లకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రేపటినుంచి ఈసినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

నందమూరి(Nandhamuri) అభిమానులకు త్వరలో గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ 30 నుంచి సాలిడ్ అప్ డేట్ ను ప్లాన్ చేశాడట కొరటాల శివ(Koratala Shiva).

యంగ్ టైగర్ ఎన్టీఆర్...బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మరోసారి భారీ యాక్షన్ సీక్వెన్స్ లకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రేపటినుంచి ఈసినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(saif ali khan) నటిస్తున్నాడు. అటు డైరెక్టర్ కొరటాల శివ కూడా ఈసినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక మూడో షెడ్యూల్ కోసం అంతా సిద్దంగా ఉంది.

ఫస్ట్ షెడ్యుల్ షూటింగ్ లోనే చాలా వరకూ భారీ యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కించిన కొరటాల.. సెకండ్ షెడ్యూల్ లో కామన్ సీన్స్ ను తెరకెక్కించారు. ఇక తాజా షెడ్యూల్ ను మాత్రం.. భారీగానే ప్లాన్ చేశారు కొరటాల. మూడో షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కోసం సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో.. ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచే ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ఈసారి తెరకెక్కించబోతున్నారట.

ఇప్పటికే ఎన్టీఆర్ 30 కోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రఫర్స్ రంగంలోకి దింపాడు కొరటాల. మొదటి షెడ్యూల్ మాదిరిగానే ఈ షూటింగ్ కూడా వారి ఆద్వర్యంలోనే జరగబోతున్నట్టు సమాచారం. ఇక ఈసినిమా నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్ డేట్ కూడా రెడీ చేస్తున్నారట టీమ్. ఈనెల 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్30 నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఈ ఫస్ట్ లుక్ తో పాటు... నందమూరి ఫ్యాన్స్ కు ఎంతో ఇస్టమైన ఆయన బర్త్ డే రోజు.. ఈమూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. సుధాకర్ మిక్కిలినేని తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Updated On 15 May 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story