మెగా హీరో కొణిదెల వరుణ్‌తేజ్ ముకుంద సినిమాతో తెరంగ్రేటం చేశాడు. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కంచె, తొలిప్రేమ, ఫిదా సినిమాలు చేశాడు. ఫిదాతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు.
మెగా హీరో కొణిదెల వరుణ్‌తేజ్ ముకుంద సినిమాతో తెరంగ్రేటం చేశాడు. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కంచె, తొలిప్రేమ, ఫిదా సినిమాలు చేశాడు. ఫిదాతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. గద్దలకొండ గణేశ్‌తో మాస్ హీరో అనిపించుకున్నాడు. ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలో కామెడీ కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. అయితే ఇటీవల అతడు నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆపరేషన్ వాలంటైన్, గాండీవధారి అర్జున సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇన్ని ఫ్లాప్‌ల తర్వాత ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకోవాలి. హిట్ దర్శకులకు డేట్స్ ఇవ్వాలి. కానీ వరుణ్ తేజ్ ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకుల సినిమాలలో నటించడానికే ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం పలాస డైరెక్టర్ కరుణ్‌కుమార్ డైరెక్షన్‌లో మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. కరుణ్‌కుమార్ ఈ మధ్యనే శ్రీదేవి సోడా సెంటర్ వంటి డిజాస్టర్ సినిమాను తీశాడు. దీంతో పాటు వరుణ్ తేజ్ మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పాడు. రవితేజతో టచ్ చేసి చూడు వంటి ఫ్లాప్ సినిమాను తీసిన విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ సినిమాను ఒప్పుకున్నాడు వరుణ్ తేజ్. అలాగే నితిన్‌తో మ్యాస్ట్రో సినిమాను, లైక్ అండ్ షేర్ వంటి ఫ్లాప్ సినిమాలను తీసిన మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి వరుణ్ తేజ్ అంగీకరించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్సులు ఎందుకు ఇస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అయినా ఒకట్రెండు సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన ఆ దర్శకుల ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనుకోండి!ఫ్లాప్ డైరెక్టర్లతో మెగా హీరో సినిమాలు...! ఎవరో తెలుసా?