ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కూతుళ్లు స్వప్న(Priyanka), ప్రియాంక దత్‌లు(Priyanka dutt) మంచి నిర్మాతలుగా పేరు సంపాదించుకున్నారు.
ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కూతుళ్లు స్వప్న(Priyanka), ప్రియాంక దత్‌లు(Priyanka dutt) మంచి నిర్మాతలుగా పేరు సంపాదించుకున్నారు. మహానటి(Mahanati) సినిమాతో వారిద్దరూ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. కల్కి(Kalki) సినిమాతో కాంక్రీట్ వేసుకున్నారు. వీరే కాదు, దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ శాకుంతలం సినిమాతో నిర్మాతగా మారారు. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య కోడి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. దిల్‌రాజు కూతురు హన్షిత ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లు నిర్మించారు. అలాగే మెగా కాంపౌండ్‌లో కూడా ఇద్దరు మహిళా నిర్మాతలు పుట్టుకొచ్చారు. ఒకరేమో నిహారిక కొణెదల(Niharika konidela), మరొకరు సుశ్మిత కొణెదల(sushmitha konidela). పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌ను స్థాపించిన నిహారిక ముందుగా వెబ్ సిరీస్‌లను నిర్మించారు. లేటెస్ట్‌గా కమిటీ కుర్రోళ్లు సినిమాను నిర్మించారు. నిర్మాతగా సక్సెసయ్యారు. నిర్మాతగా విజయాన్ని అందుకున్న నిహారికకు మెగా హీరోలు ఎవరైనా కాల్షీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మెగా కాంపౌండ్‌లో చాలా మంది హీరోలే ఉన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి దుర్గతేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్.. ఇలా అందరూ హీరోలే. వీరిలో అల్లు అర్జున్‌ను(Allu arjun) వదిలిపడితే ఎవరైనా నిహారికకు కాల్షీట్లు ఇవ్వొచ్చు. తమ ఇంటి అమ్మాయి ఎదుగుదలకు తోడ్పడవచ్చు. కానీ నిహారిక మాత్రం సినిమా తీస్తే గీస్తే పవన్ కల్యాణ్‌తోనే(Pawan kalyan) అంటున్నారు. బాబాయ్‌కు సరిపోయే మంచి కథ దొరికితే కచ్చితంగా సినిమా తీస్తానని అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం చిన్న సినిమాలనే తీస్తానని చెబుతున్నారు. ఇక గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ను స్థాపించిన సుశ్మిత కూడా వెబ్ కంటెంట్‌తోనే నిర్మాతగా మారారు. ఇప్పుడు తండ్రి చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేశారు. కారణాలు తెలియవు కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. వీరిద్దరూ మెగా కాంపౌండ్‌లోని హీరోలతో సినిమాలు తీయలేదు. త్వరలో ఆ ముచ్చట కూడా తీరుతుందేమో చూడాలి!