కోలీవుడ్‌ హీరో సూర్యతో(Suriya) కొంగర సుధ(Kongara Sudha) తీసిన సూరరై పోట్రు(Surarai Potru) సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఆకాశం నీ హద్దురా(Aakasham Ni Hadura) పేరుతో విడుదలయ్యి ఇక్కడ కూడా సక్సెసయ్యింది. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర విజయవంతం కావడమే కాకుండా పలు అవార్డులను కూడా గెల్చుకుంది.

కోలీవుడ్‌ హీరో సూర్యతో(Suriya) కొంగర సుధ(Kongara Sudha) తీసిన సూరరై పోట్రు(Surarai Potru) సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఆకాశం నీ హద్దురా(Aakasham Ni Hadura) పేరుతో విడుదలయ్యి ఇక్కడ కూడా సక్సెసయ్యింది. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర విజయవంతం కావడమే కాకుండా పలు అవార్డులను కూడా గెల్చుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నది. సూర్య కెరీర్‌లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్(dulqer salmaan), నటి నజ్రియా ఫాహద్(Nazriya fahad), నటుడు విజయ్‌ వర్మ(Vijay varama) కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్‌ నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌(AR Rehman) మేనల్లుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌(GV Praksh Kumar) సంగీతాన్ని అందిస్తున్నాడు. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. సూరరై పోట్రు సినిమాకు కూడా జీవీ ప్రకాశే సంగీతాన్ని అందించాడు. ఇదిలా ఉంటే 68వ జాతీయ అవార్డ్స్‌లో సూరరై పోట్రు సినిమా పలు అవార్డును గెల్చుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలను గెల్చుకుంది.

Updated On 27 Oct 2023 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story