Chiranjeevi : జగన్‌పై డైరెక్ట్‌గా విమర్శలు కురిపించాడు.
మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య(Waltheru Veeraya) ఎక్కడో 200 రోజులు ఆడిందట! 50 రోజులు ఆడటమే గగనమైన ఈ రోజుల్లో 200 రోజులంటే మాటలు కాదుగా! అంచేత ఓ ఫంక్షన్‌ను పెట్టి చిరంజీవితో(Chiranjeevi) మాట్లాడించారు. ఆయన జగన్‌పై(Jagan) డైరెక్ట్‌గా విమర్శలు కురిపించాడు. 'మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి.
మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య(Waltheru Veeraya) ఎక్కడో 200 రోజులు ఆడిందట! 50 రోజులు ఆడటమే గగనమైన ఈ రోజుల్లో 200 రోజులంటే మాటలు కాదుగా! అంచేత ఓ ఫంక్షన్‌ను పెట్టి చిరంజీవితో(Chiranjeevi) మాట్లాడించారు. ఆయన జగన్‌పై(Jagan) డైరెక్ట్‌గా విమర్శలు కురిపించాడు. 'మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపు నింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడతారేంటి' అని అన్నారు చిరంజీవి. పేరు ప్రస్తావించలేదు కానీ ఎవరి గురించి అన్నారో ఈజీగా చెప్పేయొచ్చు. అనుమానమేమీ అక్కర్లేదు. ఇవన్నీ జగన్(Jagan) గురించే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నామధ్య పవన్ కల్యాణ్(Pawan kalyan) పారితోషికంపైనా, బ్రో(Bro) సినిమాలో తనను అనుకరించిన విధానంపైనా వైసీసీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు చిరంజవి కౌంటర్ ఇచ్చారని అనుకోవాలా? రాజకీయాలను వదిలిపెట్టేసిన తర్వాత చిరంజీవి వాటికి చాలా దూరంగా ఉంటున్నారు. అసలు పాలిటిక్స్ ముచ్చటే ఎత్తడం లేదు. రాజకీయ నాయకులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఇన్నాళ్ల తర్వాత చిరంజీవి రాజకీయాలకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అప్పుడెప్పుడో నా తమ్ముడు చాలా గొప్పోడు.. ఎప్పటికైనా మంచి పోజిషన్‌కు వెళతాడు. జనసేనకు నా వంతు సలహాలు ఇస్తాను అని చిరంజీవి అన్నాడు కదా! అంటే తమ్ముడికి మద్దతుగానే నిన్న ఆ వ్యాఖ్యలు చేశారనుకోవాలి. ఎక్కడా బ్రో సినిమా గురించి కానీ, రెమ్యునరేషన్ల గురించి కానీ, అంబటి రాంబాబును అనుకరించడం గురించి కానీ చిరంజీవి మాట్లాడకపోయినా బ్రో వివాదం నడుస్తున్న సమయం కాబట్టి చిరంజీవి వ్యాఖ్యలు పవన్‌కు మద్దతుగా ఉన్నాయనే అనుకోవాలి. ఏది ఏమైనా చిరంజీవి వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యం ఉంది.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) తనదైన శైలిలో వీటికి కౌంటర్ ఇచ్చాడు. సినిమాల్లో ఉన్న పుడింగిలు ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. అదేదో ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొందరికి కూడా సలహాలు చెప్పొచ్చు కదా అంటూ చురకలంటించారు.సినిమా ఇండస్ట్రీలో డాన్సులు, ఫైట్‌లు గురించి సలహాలు ఇవ్వొచ్చు కదా అని కొడాలి నాని సూచించారు