క్లింకారను ఎప్పుడు చూపిస్తారంటూ.. ఫ్యాన్స్ ఎదుురు చూస్తుంటే.. ఆమె ఫేస్ కనిపించకుండా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ. తాజాగా క్లింకారా వీడియో ఒకటి వైరల్అవుతోంది.
రామ్ చరణ్ – ఉపాసన గారాలపట్టి, మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లిన్ కారా సెలబ్రిటీ గా మారింది. సోషల్ మీడియాలో ఈ స్టార్ కిడ్ కుసబంధించిన ఏ విషయం అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక క్లింకార పుట్టినప్పటి నుంచి ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంది. తన ఫేస్ కనిపించకుండానే తన ఫోటోలు సోషల్ మీడియాలో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక క్లింకారకు సబంధించినప్రతీ అప్ డేట్ ను మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటుంది. క్లింకారతో తాముగడిపిన క్షణాలను ఫోటోలు, వీడియోల రూపంలో శేర్ చేసుకుంటుంంది. అయితే ఈక్రమంలోనే తాజాగా ఉపాసన తాజాగా ఉపాసన క్లిన్ కారా క్యూట్ వీడియో ఒకటి షేర్ చేసింది.
రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన RRR బియాండ్ అండ్ బిహైండ్ డాక్యుమెంటరీని.. మెగా ఫ్యామిలీ ఇంట్లో చూస్తుండగా అందులో చరణ్ ని చూసి క్లిన్ కారా ఎగ్జైట్ అయ్యింది. తన తండ్రిని టీవీలో గుర్తు పట్టి.. స్పందిస్తుంది. మాటలు రాకపోవడంతో నాన్నా అనో డాడీ అనో పిలవలేదు కాని.. క్లింకార రియక్షన్ ను వెంటనే వీడియోలో బంధించారు ఉపాసన. ఇక ఈ క్యూట్ వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. క్లిన్ కారా మొదటిసారి వాళ్ళ నాన్నని టీవీలో చూసి ఎగ్జైట్ అవుతుంది. రామ్ చరణ్ నిన్ను చూసి గర్వపడుతున్నాను. గేమ్ ఛేంజర్ కోసం ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు. ఫ్యాన్ గ్రూప్స్ లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు రామ్ చరణ్. శంకర్ డైరెక్ట్ చేసిన ఈసినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.