హీరోయిన్ కిరణ్ రాథోడ్(Kiran Rathode) గుర్తున్నారా? జెమిని(Gemini) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలు కమలహాసన్(Kamal hasaan), అజిత్(Ajit), విజయకాంత్(Vijaykanth), ప్రశాంత్(Prashanth) వంటి వారి సరసన నటించారు. తర్వాత ఏమైందో ఏమో కానీ నెమ్మదిగా ఫేడ్ అవుటయ్యారు. చాన్నాళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒకటి రెండు సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్(Item Songs) కూడా చేశారు.

Kiran Rathod
హీరోయిన్ కిరణ్ రాథోడ్(Kiran Rathode) గుర్తున్నారా? జెమిని(Gemini) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలు కమలహాసన్(Kamal hasaan), అజిత్(Ajit), విజయకాంత్(Vijaykanth), ప్రశాంత్(Prashanth) వంటి వారి సరసన నటించారు. తర్వాత ఏమైందో ఏమో కానీ నెమ్మదిగా ఫేడ్ అవుటయ్యారు. చాన్నాళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒకటి రెండు సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్(Item Songs) కూడా చేశారు. అప్పట్లో ఈమెపై చాలా రూమర్స్ వచ్చాయి. అప్పుడు వాటి గురించి కిరణ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత ముచ్చట్లు అన్ని చెప్పారు. తన ప్రియుడు చెప్పిన మాటలు విన్నందువల్లే సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు. అదే తాను చేసిన పెద్ద తప్పని తర్వాత తనకు అర్థమయ్యిందని, మళ్లీ నటించడానికి రెడీ అయ్యేసరికి తనను కొందరు తప్పుగా వాడుకునేందుకు ప్రయత్నించారని కిరణ్ రాథోడ్ అన్నారు. అడ్జెస్ట్‌మెంట్ కావాలని చాలా మంది తనతో చెప్పారని కించిత్ ఆవేదనతో కూడిన స్వరంతో తెలిపారు. అలాంటి క్లిష్ట సమయంలో తన ప్రియుడు తనను వదిలేసి వెళ్లిపోయాడని, అందుకు కారణం తమ మధ్య ఏర్పడిన చిన్న చిన్న సమస్యలేనని చెప్పారు. ఒకసారి అతడు తనను కొట్టాడని, దాన్ని మాత్రం తాను సహించలేకపోయానని అన్నారు. ఇది జరిగిన తర్వాత అతడికి ఫోన్ చేసి రమ్మని పిలిచానని, వచ్చాక అతడిని కోపంతో కసి తీరా గట్టిగా కొట్టానని కిరణ్ రాథోడ్ చెప్పుకొచ్చారు. అప్పుడు అతడు చిరిగిన బట్టలతో రోడ్డున పడ్డాడని చెప్పారు. ఈ కారణంగానో ఏమో కొందరు తనను చెడు పనులకు ఉపయోగించుకోవాలని చూశారని, మరి కొందరు రాత్రుళ్లు ఫోన్ చేసి తప్పుగా మాట్లాడేవారని అన్నారు. తనకు మంచి స్నేహితులంటూ ఎవరూ లేరన్నారు. తనకు పెళ్లయ్యిందని, పిల్లలు పుట్టారని వదంతులు పుట్టించారు. అసలు తనకు పెళ్లే కాలేదని వివరణ ఇచ్చుకున్నారు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో కిరణ్ రాథోడ్ కంటెస్టెంట్‌గా ఉన్నారు. బిగ్‌బాస్ తర్వాత ఏమైనా సినిమా ఛాన్సులు వస్తాయేమోనని ఆమె ఎదురుచూస్తున్నారు.
