రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణ మండపం వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్త్క్రీన్ వరకు ఎదిగిన ఈ హీరో ఇప్పుడు కొత్తకొత్త కథలు చేస్తున్నారు. అయితే ఇక వినరో భాగ్యము విష్ణుకథ మూవీ ఎలా ఇప్పుడు చూద్దాం. కథ: దర్శనా (కశ్మీరా ప‌ర్ధేశీ) ఓ యూట్యూబర్. ఎన్ని వీడియోలు చేసినా వ్యూస్ మాత్రం రావు. ఫేమస్ అయ్యేందుకు నెంబర్ నైబర్స్ కి ఫోన్ చేసి వాళ్ళతో వీడియో […]

రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణ మండపం వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్త్క్రీన్ వరకు ఎదిగిన ఈ హీరో ఇప్పుడు కొత్తకొత్త కథలు చేస్తున్నారు. అయితే ఇక వినరో భాగ్యము విష్ణుకథ మూవీ ఎలా ఇప్పుడు చూద్దాం.

కథ:
దర్శనా (కశ్మీరా ప‌ర్ధేశీ) ఓ యూట్యూబర్. ఎన్ని వీడియోలు చేసినా వ్యూస్ మాత్రం రావు. ఫేమస్ అయ్యేందుకు నెంబర్ నైబర్స్ కి ఫోన్ చేసి వాళ్ళతో వీడియో ప్లాన్ చేస్తుంది. దర్శనా ఫోన్ నెంబర్ నైబర్స్ ఎవరంటే... ఒకరు, శర్మ (మురళీ శర్మ). ఆయనకు పెట్స్ క్లినిక్ ఉంటుంది. ఇంకొకరు, విష్ణు (కిరణ్ అబ్బవరం). ఇతరులకు సహాయం చేయడం అతని గుణం. ముగ్గురు కలిసి వీడియోలు చేస్తారు. ఈ క్రమంలో దర్శనతో విష్ణు ప్రేమలో పడతాడు. శర్మ కూడా దర్శనను ప్రేమిస్తాడు. అతనితోనూ సన్నిహితంగా ఉంటూ వస్తుంది. అయితే, ఒక రోజు శర్మను షూట్ చేస్తుంది. అతను చనిపోతాడు. శర్మను దర్శనా చంపడానికి కారణం ఏంటి? విష్ణు కోసం ఎన్ఐఏ ఇంకా రాయలసీమకు చెందిన ఓ మంత్రి ('కె.జి.యఫ్' లక్కీ) ఎందుకు తిరుగుతున్నారు? శర్మ హత్య కేసులో జైలుకు వెళ్ళిన దర్శనను బయటకు తీసుకు రావడం కోసం విష్ణు ఏం చేశాడు? ముంబై గ్యాంగ్ స్టర్ రాజన్ (శరత్ లోహితస్వ)కు, విష్ణుకు సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.

ఎవరు ఎలా చేశారు ?

కిరణ్ అబ్బవరం యాక్టింగ్ లో కొత్తదనం ఏమీ కనిపించలేదు. ఇంతకు ముందు చేసిన మూవీలానే అనిపించింది. అయితే, పక్కింటి కుర్రాడి క్యారెక్టర్ లో కిరణ్ బాగా సెట్ అయ్యాడు. డ్యాన్స్ ఇంకాస్త బాగా చేస్తే బావుండేదనిపించింది. ఎమోషనల్ సీన్స్ లోనూ బాగా చేయాల్సిందని చెప్పాలి ! హీరోయిన్ కశ్మీర అందంతో నెట్టుకొచ్చింది. మురళీ శర్మను పర్ఫామెన్స్ గురించి వేరే చెప్పక్కరలేదు. కొంచెం రొమాంటిక్ కామెడీ సీన్స్ పండించారు. కథలో ట్విస్టులకు మురళీ శర్మ లాంటి నటుడు ఉండటం సినిమాకు హెల్ప్ అయ్యింది. 'కె.జి.యఫ్' లక్కీ, పమ్మి సాయి, దేవి ప్రసాద్, ఆమని,
శరత్ లోహితస్వ, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్, 'శుభలేఖ' సుధాకర్... వాళ్లంతా వాళ్ల క్యారెక్టర్స్ కు తగ్గట్టు చేశారు.

Updated On 18 Feb 2023 7:20 AM GMT
Ehatv

Ehatv

Next Story