నిన్నమొన్న కిరణ్ అబ్బవరం హీరోగా సూపర్ ప్రొడఓన్ హౌస్ మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన మీటర్ చిత్రం టీజర్, సాంగ్ రిలీజై పెద్ద సందడే చేశాయి. ఇటీవలే విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంలో కిరణ్ నీట్ అండ్ సాఫ్ట్ పెరఫారమెన్స్‌కి వెరీగుడ్ రెస్పాన్స్ రావడం, సినిమా రెవిన్యూ పరంగా హిట్ రేంజ్‌ని అండుకోవడంతో కిరణ్‌కి గతంలో కన్నా ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగిందని చెప్పాలి. చాలా షార్ట్ టైంటోనే ఇంత ఫాలోయింగ్ సంపాదించుకోవడమంటే దాదాపుగా అసాధ్యం. కిరణ్‌కున్న ఫాలోయింగ్ చాలా మేజికల్ ఉంది.
నిన్నమొన్న కిరణ్ అబ్బవరం హీరోగా సూపర్ ప్రొడఓన్ హౌస్ మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన మీటర్ చిత్రం టీజర్, సాంగ్ రిలీజై పెద్ద సందడే చేశాయి. ఇటీవలే విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంలో కిరణ్ నీట్ అండ్ సాఫ్ట్ పెరఫారమెన్స్‌కి వెరీగుడ్ రెస్పాన్స్ రావడం, సినిమా రెవిన్యూ పరంగా హిట్ రేంజ్‌ని అండుకోవడంతో కిరణ్‌కి గతంలో కన్నా ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగిందని చెప్పాలి. చాలా షార్ట్ టైంటోనే ఇంత ఫాలోయింగ్ సంపాదించుకోవడమంటే దాదాపుగా అసాధ్యం. కిరణ్‌కున్న ఫాలోయింగ్ చాలా మేజికల్ ఉంది. పైగా మీటర్ సినిమాని నిర్మించింది ఆషామాషీ సంస్థ కాదు. చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా ఇద్దరు పెద్ద హీరోలు...మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణలతో ఏకకాలంలో హై వోల్టేజ్ బడ్జెట్‌లతో వాల్టేర్ వీరయ్య, వీరిసింహారెడ్డి లాటి భారీ చిత్రాలు నిర్మించడమే కాకుండా, ఏకకాలంలో సంక్రాంతి బరిలోకి రెండు సినిమాలను దించి రికార్డు బ్రేకింగ్ హిట్స్‌ను సొంతం చేసుకున్న ఓ సెన్సేషనల్ సంస్థ.
ఇటువంటి సంస్థ అధినేతలు నవీన్, రవి ఇద్దరికిద్దరు కథని నమ్మి, కిరణ్ కెపాసిటీని గేజ్ చేసి, అవసరమైనదానికి కన్నా కూడా కొంత ఎక్కువే బడ్జెట్‌ను వెచ్చించి మీటర్ చిత్రాన్ని నిర్మించారంటే అక్కడే ఈ సినిమాకి బ్రహ్మాండమైన ఇమేజ్ వచ్చింది. ట్రేడ్ వర్గాలు ఈ రోజున మీటర్ గురించి చాలా ఇంట్రస్టింగ్‌గా మాట్లాడుకుంటున్నారు పరిశ్రమలో గానీ, కిరణ్ అభిమానుల్లో గానీ. ముఖ్యంగా టీజర్ చూసిన తర్వాత మీటర్ మీద అంచనాలు పెరిగాయనే నమ్మాలి. కిరణ్ చెప్పిన డైలాగ్ కిరణ్ అభిమానుల్ని రెచ్చగొట్టింది. “ బ్లేస్ట్ అయిపోవడానికి ఇది పనర్ మీద నడిచే మామ్మూలు మీటర్ అనుకుంటున్నావా? పొగరు మీద నడిచే మాస్ మీటర్. ఆన్ అవడమే వందమీద ఉంటుంది. లిమిటేషన్స్ డీవియేషన్స్ ఉండవు....తొక్కు తొక్కు తొక్కకుంటుపోవడమే.....అనే కిరణ్ చెప్పిన డైలాగ్ సినిమాకి మాంచి మాస్ అప్పీలు తీసుకొచ్చింది. ఒక్క పాట చిత్రీకరణ గురించి కోటి రూపాయలు ఖర్చు పెట్టారంటే సినిమా ఎంత కాస్ట్‌లీగా నిర్మించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కిరణ్ అబ్బవరం చేసిన సినమాలలోనే ఇప్పటివరకూ ఇదే హైబడ్చెట్ చిత్రం అవుతుదనన్నది ట్రేడ్ టాక్. టీజర్ ప్రతీ బిట్ ఆకట్టుకునే విధంగా ఉంది. అంటే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న మాస్ మసాలా చిత్రం మీటర్. కాగా, ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రం తర్వాత తను ఫుల్ ఎనర్జీతో కనపించే చిత్రమవుతుంది అని కిరణ్ అబ్బవరం తన అభిమానులను ఆద్దేశించి చెప్పడం మీటర్‌కి ఎనర్జిటిక్ ఇమేజ్ వచ్చింది. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న మీటర్ చిత్రం కిరణ్ అబ్బవరంకి గ్రేట్ సక్సెస్‌ని తెచ్చి పెడుతుందని అందరి అంచనా...బెస్ ఆఫ్ లక్ కిరణ్.