✕
తిరుగులేని అంచనాలతో విడుదల కాబోతున్న కిరణ్ అబ్బవరం మీటర్
ఎస్ ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ వంటి సూపర్ హిట్ చిత్రాల లేటెస్ట్ స్టార్ ఆఫ్ ది మాసెస్, కిరణ్ అబ్బవరం హీరోగా సుప్రసిద్ద నిర్మాణ సంస్ధ మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన మాస్ కమర్షియల్ చిత్రం మీటర్ 7వ తారీఖున విడుదల కాబోతోంది. మాస్ ఆడియన్స్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకూ సూపర్ ఇమేజ్‌ని అతి తక్కువ కాలంలో సాధింఉకున్న మాస్ హీరో కిరణ్ అబ్బవరం డబుల్ మాస్‌గా కనిపించబోతున్న మీటర్ విడుదలకు ముందే సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకోవడమే మీటర్ ప్రత్యేకత.

x
Kiran Abbavaram Meter Movie
-
- ఎస్ ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ వంటి సూపర్ హిట్ చిత్రాల లేటెస్ట్ స్టార్ ఆఫ్ ది మాసెస్, కిరణ్ అబ్బవరం హీరోగా సుప్రసిద్ద నిర్మాణ సంస్ధ మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన మాస్ కమర్షియల్ చిత్రం మీటర్ 7వ తారీఖున విడుదల కాబోతోంది. మాస్ ఆడియన్స్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకూ సూపర్ ఇమేజ్‌ని అతి తక్కువ కాలంలో సాధింఉకున్న మాస్ హీరో కిరణ్ అబ్బవరం డబుల్ మాస్‌గా కనిపించబోతున్న మీటర్ విడుదలకు ముందే సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకోవడమే మీటర్ ప్రత్యేకత.
-
- దానికి రెండు కారణాలు. ఒకటి కిరణ్ అబ్బవరం టీజర్లోనూ, ట్రైలర్‌లోను కూడా అదిరిపోయే మాస్ డైలాగ్స్‌తో, ఎలివేటెడ్ యాక్షన్ సన్నివేశాలతో, మాస్ హిట్ సాంగ్స్‌తో కనిపించడం ప్రధానమైతే, మరొకటి ఇటువంటి చిత్రాన్ని అగ్రచిత్రనిర్మాణ సంస్థ అని పేరుతెచ్చకున్న మైత్రీ మూవీ మేకర్స్ బడ్జెట్లో ఏ మాత్రం రాజీపడకుండా మీటర్ చిత్రాన్ని నిర్మించడం. వినరో భాగ్యము విస్ణుకథ చిత్రంలో చాలా అమాయకంగా కనిపించి అందరినీ మెప్పించిన కిరణ్ అబ్బవరం, మీటర్ చిత్రంలో అందరినీ రఫ్ ఆడించే యాక్షన్ రోల్‌తో రెడీ కావడం మీటర్ చిత్రానికి ఎనలేని ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది.
-
- కిరణ్ అబ్బవరం దాదాపుగా అన్ని వేదికలపైనా మీటర్ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ ఏ విధంగా దేనికీ వెనుకాడకుండా. ఇప్పటివరకూ తన చిత్రాలలో అత్యధిక వ్యయంతో నిర్మించారని, దానిని బట్టే సినిమాకథకి, సినిమా మేకింగ్ స్టేండర్ట్స్కి ఉన్న వేల్యూ ఏమిటో అర్ధమవుతుందని చెబుతూ వచ్చాడు. ట్రేడ్ సర్కిల్లో కూడా మీటర్ దుమ్ము దులుపుతుందని హై ఎక్స్పెక్టేషన్స్ తెగ ఎక్కువయ్యాయి. ఒక్క పాటకి కోటిరూపాయలు ఖర్చు పెట్టి చిత్రీకరించామని చిత్రనిర్మాతలలో ఒకరైన రవి చెప్పడంతో సినిమాకి మాంచి ఎట్రాక్షన్ వచ్చింది.
-
- ముఖ్యంగా, కిరణ్ అబ్బవరం ఎంతో మనసు పెట్టి, కష్టపడి, తన అబిమానుల కోసం రాత్రింబవళ్ళు శ్రమించి మరీ మీటర్ సినిమా చేశాడని, అఉదుకే దానికి తగిన ఫలం గ్యారెంటీగా డబుల్, త్రిబుల్ ఉంటుందని కూడా పరివ్రమ వర్గాలు అంచనాలు కడుతున్నాయి. అన్ని కోణాలలోనూ మీటర్ చిత్రం విడుదలకు ముందే, నిర్మాణ స్థాయిలోనే సంచలనం సృష్టించడం విశేషంగా పరివ్రమ మొత్తం మీద అందరూ చర్చించుకుంటున్నారు. అందరి అంచనాల మేరకు, మీటర్ సినిమా సంచలన విజయం సాధించి, కిరణ్ అబ్బవరం కెరీర్ గ్రాఫ్‌ని శిఖరస్థాయికి తీసుకెళ్తుందని ఆశిద్దాం.

Ehatv
Next Story