కిరణ్ అబ్బవరం.. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'రాజా వారు రాణి గారు' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు

కిరణ్ అబ్బవరం.. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'రాజా వారు రాణి గారు' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో రహస్య గోరక్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఇద్దరు ప్రధాన నటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు చివరికి వారిద్దరూ ప్రేమలో పడ్డారు.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ నటీనటుల మధ్య అనుబంధం గురించి ప్రస్తావిస్తూ అనేక వార్తా కథనాలు వచ్చాయి.. కానీ వారు పెద్దగా స్పందించలేదు. ఏదో ఒక ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం చిన్నగా హింట్ ఇచ్చాడు అంతే.

తాజాగా హైదరాబాద్‌లోని రిధీర రిట్రీట్‌లో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌ల నిశ్చితార్థం జరిగింది. ఈ జంటకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ జంట 2024లో పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీరి పెళ్ళికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. కిరణ్ అబ్బవరంది ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా. రహస్య గోరక్ హైదరాబాదులో పుట్టి పెరిగింది.

Updated On 14 March 2024 1:05 AM GMT
Yagnik

Yagnik

Next Story