టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం హీరోయిన్‌ రహస్య గోరక్‌ను గురువారం కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకున్నారు

టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం హీరోయిన్‌ రహస్య గోరక్‌ను గురువారం కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ జంట సాంప్రదాయ దుస్తులలో మెరుస్తున్న ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కిరణ్ తెల్లటి దుస్తులను ధరించగా, రహస్య బంగారు వ‌ర్ణం చీరలో మెరిసిపోయింది.

కిరణ్, రహస్య 'రాజా వారు రాణి గారు' చిత్రంలో కలిసి న‌టించారు. అప్ప‌టి నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించిన‌ట్లు తెలుస్తుంది. వివాహం త‌ర్వాత తిరిగి షూటింగ్‌ల‌కు హాజ‌రుకానుంది ఈ జంట‌. కిరణ్ వచ్చే నెలలో షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. అలాగే వీరిద్దరూ కలిసి రాబోయే చిత్రం 'కా'లో కూడా కనిపించనున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story