దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కింగ్ ఆఫ్ కోత(King of Kotha). ఈ సినిమాకు అభిలాష్ జోషి(Abhilash Joshi) దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్, వేఫేరల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో దుల్కర్‌కు జంటగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు.

King of Kotha Trailer
దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కింగ్ ఆఫ్ కోత(King of Kotha). ఈ సినిమాకు అభిలాష్ జోషి(Abhilash Joshi) దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్, వేఫేరల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో దుల్కర్‌కు జంటగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు. ఈ నెల 24న విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ ట్రైలర్స్‌ను హీరోలు నాగార్జున, షారూక్‌ఖాన్, మోహన్‌లాల్, సూర్య విడుదల చేశారు. ఇందులో కథానాయకుడు తన తండ్రిలా పేరుమోసిన రౌడీ అవ్వాలని అనుకుంటాడు. కానీ కోతా అనే ఊరుకు రాజయ్యాడు. ప్రజల మనిషి అయ్యాడు. ప్రత్యర్థులను ఎదిరించే హీరో అయ్యాడు. మరి ఆ రాజు ఎలా రాజయ్యాడో తెలియాలంటే కింగ్ ఆఫ్ కోతా సినిమాను చూడాల్సిందేనని అంటోంది చిత్ర బృందం. ట్రైలర్‌లో మాస్ లుక్‌తో, భిన్నమైన నటనతో దుల్కర్ కొత్తగా కనిపించాడు. ఇప్పటి వరకు ప్రేమకథా చిత్రాలు, కుటుంబకథా సినిమాలు చేసిన దుల్కర్ ఇప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. కింగ్ ఆఫ్ కోత ఒక అసాధారణ ప్రయాణమని, గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథతో రూపొందించామని హీరో దుల్కర్ సల్మాన్ అంటున్నాడు.
