Leander Paes and Kim Sharma break up : కలిసిరాని ప్రేమ, నాలుగోసారి బ్రేకప్ చెప్పిన ఖడ్గం బ్యూటీ!
కొందరికి ప్రేమలు అసలు అచ్చిరావు. ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ(Kim Sharma)ది ఇదే పరిస్థితి. ఆమె నాలుగు ప్రేమబంధాలు అంతే! ఏ ఒక్కటి పట్టుమని అయిదేళ్లు నిలవలేదు. నిన్నమొన్నటి వరకు కిమ్‌శర్మ టెన్నిస్ మాజీ చాంపియన్ లియాండర్ పేస్(Leander Paes)తో కలిసిమెలిసి ఉండింది. ఇప్పుడా బంధం ముక్కలయ్యింది. వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఒకటే కథనాలు.. ఇది నిజమేమోనన్నట్టుగా కిమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లియాండర్ పేస్‌తో కలిసి దిగిన ఫోటోలన్నీ డిలీట్ చేసింది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకుంటారనుకున్నారంతా..

Kim Sharma
కొందరికి ప్రేమలు అసలు అచ్చిరావు. ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ(Kim Sharma)ది ఇదే పరిస్థితి. ఆమె నాలుగు ప్రేమబంధాలు అంతే! ఏ ఒక్కటి పట్టుమని అయిదేళ్లు నిలవలేదు. నిన్నమొన్నటి వరకు కిమ్‌శర్మ టెన్నిస్ మాజీ చాంపియన్ లియాండర్ పేస్(Leander Paes)తో కలిసిమెలిసి ఉండింది. ఇప్పుడా బంధం ముక్కలయ్యింది. వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఒకటే కథనాలు.. ఇది నిజమేమోనన్నట్టుగా కిమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లియాండర్ పేస్‌తో కలిసి దిగిన ఫోటోలన్నీ డిలీట్ చేసింది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకుంటారనుకున్నారంతా.. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ కిమ్ విడిపోవాలన్న నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు లవ్ స్టోరీలు ఇలాగే బ్రేక్ అయ్యాయి. ఖడ్గం సినిమాతో తెలుగు సినిమాల్లో అడుగు పెట్టిన కిమ్‌శర్మ తర్వాత చెప్పుకోదగ్గర రోల్సేమీ రాలేదు. మగధీరలో ఏం పిల్లడో ఎల్దం వస్తవా పాట మాత్రం బాగా పాపులరయ్యింది. బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించింది. మొదట్లో క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh)నులవ్వాడింది. కారణం తెలియదు కానీ యువరాజ్‌తో తెగతెంపులు చేసుకుంది. 2010లో కెన్యాకు చెందిన ఓ బిజినెస్‌మన్‌ను పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకే ఆ పెళ్లి పెటాకులయ్యింది. ఆ తర్వాత యాక్టర్ హర్షవర్ధన్ రాణే(Harshvardhan Rane)ను ప్రేమముగ్గులో దింపింది. అతడు వదిలేశాడో , ఈమెనే కాదనుకుందో తెలియదు కానీ వీరిద్దరు కూడా విడిపోయారు. రెండేళ్ల పాటు లియాండర్ పేస్‌తో రిలేషన్‌లో ఉంది. ఇప్పుడు అతడికి కూడా బై బై చెప్పేసింది. లియాండర్ తక్కువోడేం కాదు.. ఇతను కూడా చాలామందిని ప్రేమించాడు. ప్రముఖ మోడల్ రియా పిళ్లై(Rhea Pillai)తో సహజీవనం కూడా చేశాడు. ఈ జంటకు ఓ కూతురు కూడా పుట్టింది. తర్వాత కిమ్ ప్రేమలో కూరుకుపోయాడు. రెండున్నరేళ్ల కిందట టెన్నిస్ నుంచి తప్పుకున్న పేస్ మొత్తంగా ఏడు ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 1996లో అట్లాంటాలో జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించాడు.
