ఎప్పుడూ ఏదో ఒక వివాదం లో ఉంటూ వస్తున్నాడు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్(Kiccha Sudeep). ఆమధ్య హిందీ భాష విషయంలో.. నార్త్ హీరోలతో నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాడు సుదీప్.. ఇక ఆ వివాదం ముగిసింది అనుకోగానే.. మరోవివాదం.. ఇలా సుదీప్ విషయంలో ఏదో ఒక వివాదం నానుతోంది.
ఎప్పుడూ ఏదో ఒక వివాదం లో ఉంటూ వస్తున్నాడు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్(Kiccha Sudeep). ఆమధ్య హిందీ భాష విషయంలో.. నార్త్ హీరోలతో నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాడు సుదీప్.. ఇక ఆ వివాదం ముగిసింది అనుకోగానే.. మరోవివాదం.. ఇలా సుదీప్ విషయంలో ఏదో ఒక వివాదం నానుతోంది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగుతున్న వారిలో కిచ్చా సుధీప్ ఒకరు. కన్నడ నాట ఆయనకు ఉన్న ఇమేజ్ అంతాఇంతా కాదు. తెలుగులో కూడా విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుదీప్ కు మంచిపేరు ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ..టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి పేరు సంపాదించాడు కిచ్చా సుదీప్. అయితే .. కన్నడ నాట మాత్రం సుదీప్ ఎన్నో వివాదాల్లో నానుతున్నాడు. ప్రస్తుతం ఆయనపై కన్నడ నిర్మాతలు(Kannada Producers) కొందరు కోర్డుకెక్కారు(Court). సుదీప్ పై అనేక ఆరోపణలు చేశారు. అయితే వాటిని తిప్పికొడుతూ రివర్స్ కేస్ పెట్టాడు సుదీప్.
తాజా సమాచారం ప్రకారం. నిర్మాతలుతనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని.. తనపై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ సుదీప్ వెల్లడించాడు. మరీ ముఖ్యంగా నిర్మాత MN కుమార్(MN Kummar) ఆరోపణలపై కిచ్చ సుదీప్ ఫైర్ అయ్యాడు. అతనిపై 10 కోట్లకు పరువునష్టం దావా కేసు(Defamation suit case) వేశాడు. అంతే కాకుండా తనపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగంగా క్షమాపణలు(Apologies) చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇంతకీ నిర్మాతలు ఏమన్నారు.. సుదీప్ పై వచ్చిన ఆరోపణలు ఏంటంటే..?
ఎనిమిదేళ్ల కింద కిచ్చా సినిమా ఓ సినిమా చేసేందుకు ఆ నిర్మాతలతో అంగీకరించారు. కాగా, ఇప్పటి వరకు వారికి డేట్స్ ఫిక్స్ చేయలేదు. కోటిగొబ్బ3(Kotigobba3), విక్రాంత్ రోణ(Vikranth rona) సినిమాల తరువాత తమతోనే సినిమా చేస్తానని హామీని కూడా ఇచ్చారు. ఇదే విషయమై సుదీప్ ను కలిసేందుకు ప్రయత్నించినా రెస్పాండ్ కావడం లేదని ఆరోపించారు. తాము చేయబోయే సినిమాకు ముత్తట్టి సత్యరాజు అనే టైటిల్ ను కూడా ఫైనల్ చేసి పెట్టామని, సుదీప్ నుంచి ఎలాంటి రిప్లై రావడం లేదని మండిపడ్డారు. అంతే కాదు ఈ సినిమా కోసం కొంత రెమ్యూనరేషన్ కూడా సుదీప్ తీసుకున్నాడని.. తిరిగి ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తున్నారు.