సినిమా(Movies) రంగంలో రెమ్యూనిరేషన్ విషయంలో కథానాయికలు(Heroines) వివక్షకు గురవుతున్నారనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. ఆ మాటకొస్తే ఒక్క సినిమా రంగంలోనే కాదు, స్పోర్ట్స్‌లో(Sports) కూడా ఈ వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. పురుషులకు ఇచ్చే ప్రైజ్‌మనీతో పోలిస్తే మహిళలకు ఇచ్చేది చాలా తక్కువ.
సినిమా(Movies) రంగంలో రెమ్యూనిరేషన్ విషయంలో కథానాయికలు(Heroines) వివక్షకు గురవుతున్నారనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. ఆ మాటకొస్తే ఒక్క సినిమా రంగంలోనే కాదు, స్పోర్ట్స్‌లో(Sports) కూడా ఈ వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. పురుషులకు ఇచ్చే ప్రైజ్‌మనీతో పోలిస్తే మహిళలకు ఇచ్చేది చాలా తక్కువ. దీనిపై కూడా అప్పుడప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తుంటారు మహిళా క్రీడాకారిణులు. సరే మళ్లీ సినిమాల విషయానికి వస్తే హీరోలతో పోల్చితే హీరోయిన్‌లకు చాలా తక్కువ మొత్తంలో పారితోషికం లభిస్తున్నది. ఈ విషయం గురించి టాప్ హీరోయిన్ కియారా అద్వాణీ(Kiara Advani) తన అభిప్రాయాన్ని తెలిపారు. రెమ్యునిరేషన్(Remuneration) విషయంలో వివక్ష గురించిన చర్చ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
మన ప్రతిభ ఆధారంగానే రెమ్యునరేషన్స్‌ను నిర్ణయిస్తారు. హీరోయిన్ల ఛరిష్మా సినిమాకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది? ప్రేక్షకులను కథానాయికలు ఏ స్థాయిలో ఆకర్షించగలరు? అన్న అంశాలను పరిగణనలోకి తీసుకునే పారితోషికాలను ఫిక్స్ చేస్తారు. అందుకే పారితోషికాల గురించి పెద్దగా ఆలోచించకుండా ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలి. మన ప్రతిభకు ఎవరు ఎక్కువ విలువను ఇస్తారో, వారి కంపెనీలలో ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడు రెమ్యునిరేషన్ల గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు' అని కియారా అద్వాణీ తెలిపారు. సిద్ధార్థ మల్హోత్రాను(Siddharth Malhotra) పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన కియారా అద్వాణీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలో బిజీగా మారారు.