మహేశ్‌బాబు(Mahesh Babu)హీరోగా వచ్చిన భరత్ అనే నేను(Bharath Ane nenu) సినిమాలో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీ(Kiara advani) తర్వాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram charan) హీరోగా బోయపాటి శీను(Boyapati sreenu) తీసిన వినయ విధేయ రామలో(Vinaya vidheya Rama) కథానాయికగా నటించారు. ఆ తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. రెండేళ్ల కిందట వచ్చిన భూల్ భులయ్యా 2లో(Bhul Bhulaya 2) చక్కగా నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను(Siddharth Malhotra) పెళ్లి చేసుకున్నారు.
మహేశ్‌బాబు(Mahesh Babu)హీరోగా వచ్చిన భరత్ అనే నేను(Bharath Ane nenu) సినిమాలో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీ(Kiara advani) తర్వాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram charan) హీరోగా బోయపాటి శీను(Boyapati sreenu) తీసిన వినయ విధేయ రామలో(Vinaya vidheya Rama) కథానాయికగా నటించారు. ఆ తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. రెండేళ్ల కిందట వచ్చిన భూల్ భులయ్యా 2లో(Bhul Bhulaya 2) చక్కగా నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను(Siddharth Malhotra) పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరమవుతారేమోనని చాలా మంది భావించారు. వివాహం తర్వాత నటించడం ఎందుకు అంటూ ఆమెపై కొందరు విమర్శలు కూడా చేశారు. వాటిని పట్టించుకోకుండా కియారా అద్వానీ సినిమాల్లో కొనసాగుతున్నారు. ' కొందరు చేసిన కామెంట్స్ అప్పట్లో నన్ను చాలా బాధపెట్టాయి.
అయితే ప్రేక్షకులు మాత్రం నా విషయంలో ఎంతో ప్రేమ చూపించారు. నా సినిమాలు ఆదరించారు. అది నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది'. అని కియారా అద్వాని అన్నారు. ఇటీవల సత్యప్రేమ్ కీ కథ(Sathya Prem Ki Katha) చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడారు. తనపై వచ్చిన విమర్శలపై, ట్రోలింగ్ విషయంలో భర్త సిద్దార్థ్ మల్హోత్ర ఎప్పుడూ తోడు వుండేవాడని చెప్పారు. ' సిద్ధార్థ్ నాకు ఎంతో ధైర్యం చెప్పేవాడు. నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ల మాటలను ఎప్పుడూ పట్టించుకోకుండా మన పని మనం నిజాయితీగా చేసుకుంటూ పోవాలని అనేవాడు. విమర్శల గురించి లోతుగా ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా ఎక్కువగా వస్తాయని ఆయన బోధించేవాడు' అని కియారా అద్వానీ చెప్పారు. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్‌లో కియారా హీరోయిన్‌గా నటిస్తున్నారు.