బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్ కియారా అద్వాణి(Kiara Advani)పెళ్లయిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె సినిమా కెరీర్‌ స్పీడ్‌ అందుకుంది. ప్రస్తుతం కియారా అద్వాణీ గేమ్‌ ఛేంజర్‌(Game Changer), వార్‌-2(War-2) వంటి సినిమాలలో నటిస్తున్నారు. సినీ రంగంలో పోటీ గురించి తాను అసలు ఆలోచించనని,

బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్ కియారా అద్వాణి(Kiara Advani)పెళ్లయిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె సినిమా కెరీర్‌ స్పీడ్‌ అందుకుంది. ప్రస్తుతం కియారా అద్వాణీ గేమ్‌ ఛేంజర్‌(Game Changer), వార్‌-2(War-2) వంటి సినిమాలలో నటిస్తున్నారు. సినీ రంగంలో పోటీ గురించి తాను అసలు ఆలోచించనని, ప్రతి సినిమాను ఓ సవాల్‌గా భావిస్తూ నటిగా పరిణతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని కియారా అద్వానీ అంటున్నారు. పెళ్లయ్యాక తన కేరీర్‌ మరింత ఊపందుకుందని, కథల ఎంపికలో కూడా తన ప్రాధాన్యతలు మారాయని తెలిపారు. 'సినిమా పరిశ్రమలో ప్రతీ నటికి కొన్ని ప్రత్యేకలు ఉంటాయి. అందుకే కెరీర్‌పరమైన పోటీ గురించి పట్టించుకోను. వృత్తిపరంగా గత ఏడాది కంటే ఇప్పుడు ఎంత మెరుగ్గా ఉన్నామన్నదే నాకు ప్రధానం. నాతో నేను పోటీ పడుతూ ఉత్తమ నటిగా పరివర్తన పొందే క్రమాన్ని ఆస్వాదిస్తున్నాను. కాలం గడుస్తున్న కొద్దీ మనం ప్రతిభాపాటవాలలో ఎంతో కొంత మార్పు ఉండాలి. అలా లేకపోతే సమయం వృథా అయినట్లే. రెండేళ్ల కిందటితో పోలిస్తే సినిమా ఎంపికలో ఎంతో పరిణతి వచ్చింది. నటిగా నా ప్రయాణం గర్వంగా ఉంది' అని కియారా అద్వానీ అన్నారు.

Updated On 18 Aug 2023 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story