కార్తీ హీరోగా వచ్చిన 'ఖైదీ' సినిమా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి సినిమా

కార్తీ హీరోగా వచ్చిన 'ఖైదీ' సినిమా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి సినిమా. ఈ సినిమా ఊహించని భారీ ఇంపాక్ట్ ను సృష్టించింది. 'ఢిల్లీ' క్యారెక్టర్ అనేది ఇప్పటి వరకూ ఎవరూ మరచిపోలేరు. లియో తర్వాత వెంటనే ఖైదీ 2 సినిమాను ప్లాన్ చేశారు.. కానీ లియో షూటింగ్ మధ్యలో, లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో ఒక చిత్రానికి సంతకం చేశారు. ఖైదీ, విక్రమ్, లియో లాగా రజనీకాంత్ సినిమా LCUలో భాగం కాదు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే లేదా జూన్‌లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రజనీకాంత్ ప్రస్తుతం వెట్టియాన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

కార్తీ, ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో.. ఢిల్లీగా త్వరలోనే తిరిగి మీ ముందుకు వస్తానని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఈ సినిమాకు సంబంధించి లోకేష్ కనగరాజ్ టీమ్ 10 నుండి 15 నిమిషాల వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఖైదీ2 ఖచ్చితంగా LCUలో అత్యంత హైప్ ఉన్న చిత్రం అవుతుంది. దీనికి ఆల్ ఇండియా క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఖైదీ తర్వాతనే ఏ క్యారెక్టర్ అయినా అని ఎల్సీయు అభిమానులు చెబుతున్నారు. ఖైదీ 2 తర్వాత, లోకేష్ కనగరాజ్ రోలెక్స్ పాత్రపై ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత, విక్రమ్ 2 విడుదల అవుతుంది. ఇది LCU ముగింపు అని చెబుతున్నారు.

Updated On 2 March 2024 10:17 PM GMT
Yagnik

Yagnik

Next Story