అభిమానం హద్దులు దాటకూడదు. అది ప్రాణాల మీదకు తేకూడదు. ప్రాణాలకుతెగించిన మాకేదో చేయడండి అని స్టార్ హీరోలు కూడా కోరుకోవడం లేదు. అనవసరంగా వెర్రి అభిమానంతో ప్రాణాల మీదకు తెచ్చుకుని.. హీరోలకు కూడా చెడ్డపేరు తీసుకువస్తున్నారు. అంతే కాదు హీరోలను నలుగురు నాలుగు మాటలు అనేలా చేయడంతో పాటు.. వారికి కూడా అభిమానుల మీద విరక్తి పుట్టేలా ప్రవర్తిస్తుంటారు.

ప్రమాదంలో మరణించిన అభిమానులు కుటుంబాలను పరామర్శించారు పార్ ఇండియా స్టార్ యష్(Actor Yash). ఈసందర్భంగా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమంటున్నారుంటే..ఝ

అభిమానం హద్దులు దాటకూడదు. అది ప్రాణాల మీదకు తేకూడదు. ప్రాణాలకుతెగించిన మాకేదో చేయడండి అని స్టార్ హీరోలు కూడా కోరుకోవడం లేదు. అనవసరంగా వెర్రి అభిమానంతో ప్రాణాల మీదకు తెచ్చుకుని.. హీరోలకు కూడా చెడ్డపేరు తీసుకువస్తున్నారు. అంతే కాదు హీరోలను నలుగురు నాలుగు మాటలు అనేలా చేయడంతో పాటు.. వారికి కూడా అభిమానుల మీద విరక్తి పుట్టేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వేశాలు వేయ్యడం వల్లే హీరో అజిత్ తన అభిమాన సంఘాలు రద్దు చేయడంతో పాటు.. ఎవరు పెట్టినా ఊరుకునేది లేదు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ప్రస్తుతం అభిమానులు చేసే పని వల్ల కన్నడ స్టార్ హీరో యష్ సంచలన కామెంట్స్ చేయాల్సి వచ్చింది.

నిన్న( జనవరి 8) కన్నడ స్టార్ హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు బ్యానర్ కడుతూ ముగ్గరు మరణించిన విషయం తెలిసిందే.. ఇక వారి కుటుంబాలను పరామర్శించడానికి.. పాన్ ఇండియా స్టార్.. స్వయంగా అభిమానులు ఇంటికి వచ్చారు.ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ అందరిని బాధపెట్టాయి. యష్ బాధను బయటకు తెలిసేలా చేశాయి. కర్ణాటక గడగ్ జిల్లాలోని సురంగి గ్రామంలో యశ్ అభిమానులైన ముగ్గురు యువకులు అకారణంగా మరణించారు. యశ్ పుట్టిన రోజు సందర్భంగా అత్యుత్సాహానికి పోయి.. ప్రమాదం పసికట్టకుండా.. తమ అభిమాన హీరో బ్యానర్స్ కడుతుండగా పక్కనే ఉన్న పవర్ లైన్ నుంచి హై వోల్టేజ్ షాక్ కొట్టడంతో ఆ యువకులు అక్కడికక్కడే పడిపోయారు.

హుటాహుటిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లీ తండ్రులు.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే మరణించిన వారు అంతా చిన్న కుర్రాల్లు.. హనుమంత్(24), మురళి(20), నవీన్(20).. అనే ముగ్గురు ఎంతో భవిష్యత్తు ఉన్నవీరు.. చిన్న విషయానికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

ఈ ఘటన సమాచారం తెలుసుకున హీరో యశ్ నిన్న సాయంత్రంఆ మరణించిన ముగ్గురి అభిమానుల కుటుంబాలని పరామర్శించి ఓదార్చాడు. యశ్ రావడంతో ఆ యువకుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. వారిని పరామర్శించిన అనంతరం యశ్ మీడియాతో మాట్లాడుతూ.. తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాకు ఇంతమంది ఫ్యాన్స్ రావడం నా అదృష్టం. నేనెప్పుడూ నా కోసం బ్యానర్లు కట్టి హంగామా చేయమని అడగను. ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజుకి మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఏమైనా అవుతుందేమో అని నేను భయపడుతున్నాను. అందరికి ఫ్యామిలీ ఫస్ట్. ఆతరువతే అభిమాన హీరోలు.. ఎవరైనా సరే ముందు ప్యామిలీ.. మీకు కూడా మీ కుటుంబమే ఫస్ట్ ఉండాలి.

కుటుంబం తర్వాతే ఎవరైనా. అయినా మీకో విషయం చెప్పాలి..అభిమానులు బాధపడతారని నేను డైరెక్ట్ గా ఇన్ని రోజులు చెప్పలేదు. నేను పుట్టిన రోజూ జరుపుకొను..కరోనా నుంచే నేను పుట్టిన రోజు జరుపుకోవట్లేదు. ఇలాంటి బర్త్ డేలు ఎవరూ కోరుకోరు. డబ్బులు సాయం ఎవరైనా చేస్తారు. కానీ పోయిన కొడుకు తిరిగి రాడు. మీరు ఇలా చేయడం వల్ల నా పుట్టిన రోజంటేనే నాకు అసహ్యం వేస్తుంది. దయచేసి ఇలాంటివి చేయకండి. అని రిక్వెస్ట్ చేశారు. అంతే కాదు అలాగే కొంతమంది అభిమానులు నా కార్ వెనక బైక్ మీద ఫాలో వాడుతూ స్పీడ్ గా వస్తున్నారు, దయచేసి అలా చేయకండి అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

ఇంత చెప్పినా అల్లరి ముకలు మాత్రం వినలేదు యశ్ రావడంతో అభిమానులు ఆయన్ని వెంబడించారు. కొంతమంది బైక్స్ పై యష్ కారును వెంబడించగా ఓ అభిమానికి ఈ కంగారులో యాక్సిడెంట్ అయ్యింది. యష్ చెప్పిన మాటలు చాలామంది యువత పెడచెవిన పెట్టారు. అయితే ఆ అభిమానిని కూడా యశ్ హాస్పిటల్ కు వెళ్లి పరామార్శించారు.

Updated On 9 Jan 2024 6:17 AM GMT
Ehatv

Ehatv

Next Story