ఎంతో ఉత్సాహంతో తమ అభిమాన కేజీఎఫ్ స్టార్ యశ్(Yash) పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ.. విషాదం అభిమానులను కమ్మేసింది. యష్ పుట్టినరోజు(Birthday) వేడుకల వేళ ముగ్గరు అభిమానులు కన్నుమూశారు. కన్నడ నాట స్టార్ హీరోగా.. కెజియఫ్(KGF) సినిమాలతో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు యంగ్ స్టార్ యష్. దాదాపు టాప్ హీరోగా దాదాపు 15 ఏళ్లకు పైగా కన్నడ సినీరంగంలో ఉన్నారు. అయితే యష్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అంటే..కెజియఫ్ అనే చెప్పలి.

ఎంతో ఉత్సాహంతో తమ అభిమాన కేజీఎఫ్ స్టార్ యశ్(Yash) పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ.. విషాదం అభిమానులను కమ్మేసింది. యష్ పుట్టినరోజు(Birthday) వేడుకల వేళ ముగ్గరు అభిమానులు కన్నుమూశారు. కన్నడ నాట స్టార్ హీరోగా.. కెజియఫ్(KGF) సినిమాలతో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు యంగ్ స్టార్ యష్. దాదాపు టాప్ హీరోగా దాదాపు 15 ఏళ్లకు పైగా కన్నడ సినీరంగంలో ఉన్నారు. అయితే యష్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అంటే..కెజియఫ్ అనే చెప్పలి. ఆయనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది కేజీఎఫ్ సినిమా(Cinema). ఈ చిత్రం యొక్క రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి మరియు యష్ పాన్ ఇండియా(PAN India) స్టార్ అయ్యాడు.

KGF విజయం తర్వాత, నటుడు యష్‌కి అభిమానుల సంఖ్య పెరిగింది. ఇక ఈసినిమాల తరువాత చాలా గ్యాప్ ఇచ్చాడు హీరో. ఎప్పుడెప్పుడు సినిమా అనౌన్స్ చేస్తారా అని విసిగిపోయిన ఫ్యాన్స్ కు రీసెంట్ గా గుడ్ న్యూస్(Good News) చెప్పాడు. యష్ తదుపరి చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్(Geetu mohan das) ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్(Shooting) ప్రారంభం కానుంది. ఇక యష్ 38వ పుట్టినరోజును అట్టహాసంగా జరుపుకుంటున్నారు అభిమానులు. సామాన్యులు, సెలబ్రిటీలు ఆయన్ను విష్ చేశారు. సోషల్ మీడియాలో(Social Media) ఆయనకు అభినందనల వర్షం కురుస్తోంది. అయితే ఈ వేడుకల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. యష్ పుట్టినరోజు బ్యానర్ పెట్టేందుకు వెళ్లిన ముగ్గురుఅభిమానులు విద్యుద్ఘాతానికి(Current Shock) గురయ్యారు. నిన్నరాత్రి యష్ పుట్టినరోజు సందర్భంగా , కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని కటక్ జిల్లాలో యష్ అభిమానులు కొందరు అతనిని భారీ కటౌట్ కట్టడానికి వెళ్లారు.

అది కట్టే సమయంలో బ్యానర్ విద్యుత్ తీగకు తగలడంతో ముగ్గురు ఫ్యాన్లు విద్యుదాఘాతానికి గురయ్యాయి.యష్ అభిమానులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యశ్ పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు అభిమానులు మృతి చెందడం కర్ణాటకలో విషాదాన్ని నింపింది.

Updated On 8 Jan 2024 8:49 AM GMT
Ehatv

Ehatv

Next Story