కేజీఎఫ్‌(KGF) సినిమాలతో హీరో యశ్‌ ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌ అయ్యాడు. కేజీఎఫ్‌ సినిమాలకు ముందు అసలు యశ్‌(Actor Yash) అనే హీరో ఉన్నాడన్న సంగతి కన్నడేతరలకు తెలియదు. కేజీఎఫ్‌ సిరీస్‌ సినిమాలు బ్రహ్మండమైన విజయాలను సాధించడంతో యశ్‌ పేరు ప్రపంచమంతటా వినిపించింది. యశ్‌కు ఈ సినిమా తెచ్చిన స్టార్‌డమ్‌ అంతా ఇంతా కాదు. దంగల్‌ దర్శకుడు కూడా యశ్‌తో సినిమా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడంటే ఆయన క్రేజ్‌ ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతోంది.

కేజీఎఫ్‌(KGF) సినిమాలతో హీరో యశ్‌ ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌ అయ్యాడు. కేజీఎఫ్‌ సినిమాలకు ముందు అసలు యశ్‌(Actor Yash) అనే హీరో ఉన్నాడన్న సంగతి కన్నడేతరలకు తెలియదు. కేజీఎఫ్‌ సిరీస్‌ సినిమాలు బ్రహ్మండమైన విజయాలను సాధించడంతో యశ్‌ పేరు ప్రపంచమంతటా వినిపించింది. యశ్‌కు ఈ సినిమా తెచ్చిన స్టార్‌డమ్‌ అంతా ఇంతా కాదు. దంగల్‌ దర్శకుడు కూడా యశ్‌తో సినిమా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడంటే ఆయన క్రేజ్‌ ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతోంది. ఇక యశ్‌ కూడా కేజీఎఫ్‌ తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. తొందరపడి ఏది పడితే అది ఒప్పేసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకే చాలా కాలం గ్యాప్‌ తీసుకున్నాడు. ఇప్పుడు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌కు(Geetu Mohan) గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా డిసెంబర్‌ మూడో వారంలో ఘనంగా లాంచ్‌ కాబోతున్నట్టు సమాచారం. ఇక ఈ కథ గోవాలో జరిగే డ్రగ్ మాఫియా చుట్టూ జరుగుతుందట. కొన్ని నెలలుగా యశ్‌ ఈ కథతోనే ట్రావెల్‌ చేస్తున్నాడట! మరీ ముఖ్యంగా కొన్ని నెలల కిందట గోవాకి వెళ్లి అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడట! అంతేకాకుండా గన్‌ షూటింగ్‌ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడట! ఇలా షూటింగ్‌ స్టార్‌ అయ్యే సమయానికి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని యశ్‌ అనుకుంటున్నాడు. గతంలో రెండు సినిమాలకు గీతూ మోహన్‌ దర్శకత్వం వహించారు. నివిన్ పాల్‌తో ముథూన్‌ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా తీశారు. నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా నివిన్‌ కెరీర్‌లో అత్యుత్తమ సినిమాగా నిలిచింది. గీతూ మోహన్‌ దాస్‌ టేకింగ్‌, విజన్‌.. హీరో క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం యశ్‌తో సినిమా చేస్తున్నారంటే ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated On 13 Sep 2023 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story