వివాదంలో కేజీఎఫ్ హీరో
బెంగుళూరులో(Bangalore) K.G.F హీరో(KGF) యశ్(Yash) నటించిన టాక్సిక్ సినిమా సెట్‌ను(Set) రూపొందించడానికి వందలాది చెట్లను నరికివేశారని(Deforestration) మంత్రి ఆరోపించారు.. పీణ్య-జాలహళ్లిలోని వివాదాస్పద 599 ఎకరాల అటవీ(Forest) ప్రాంతంలో నటుడు యశ్ నటిస్తోన్న సినిమా సెట్ కోసం చెట్లను నరికివేశారని తెలిపారు. ఈ మేరకు పర్యావరణ(Environment loss) నష్టాన్ని చూపుతున్న ఉపగ్రహ చిత్రాలను కర్నాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే(Eshwar Khandre) విడుదల చేశారు. ఇందులో ప్రమేయం ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెట్ల తొలగింపునకు అనుమతి ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఖండ్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల సైట్‌ను సందర్శించినప్పుడు, సినిమా సెట్‌ను ఏర్పాటు చేయడానికి అటవీ భూమిలో విస్తృతంగా వృక్షాలను తొలగించడాన్ని ఖండ్రే గమనించారు. హెచ్‌ఎంటీ, అటవీశాఖ మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదిరిందని ఆయన పేర్కొన్నారు. ఈ భూమిలో కొంత భాగాన్ని సినిమా షూటింగ్‌ల కోసం అద్దెకు ఇచ్చారని, అందులో చెట్లను తొలగించే పని ఉందని అధికారులు మంత్రికి తెలియజేశారు. 599 ఎకరాల విస్తీర్ణాన్ని అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా "రిజర్వ్ ఫారెస్ట్" గా ప్రకటించారని మంత్రి హైలైట్ చేశారు. అయితే, ఈ భూమిని డి-నోటిఫికేషన్ లేకుండా హెచ్‌ఎంటీకి కేటాయించారు. అటవీయేతర కార్యకలాపాల కోసం హెచ్‌ఎంటీ వివిధ ప్రభుత్వ , ప్రైవేట్ ఏజెన్సీలకు భాగాలను విక్రయించిందని ఆరోపించారు. చెట్ల అక్రమ తొలగింపుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అధికారికంగా డి-నోటిఫై చేయకపోతే అది అడవిగానే మిగులుతుందని సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు.