దేవర (Devara) సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏఫ్రిల్ 5న రిలీజ్ అవబోతున్న ఈ చిత్రం ఆడియన్స్‌కు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోందో చూడాలి మరి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర (Devara). రీసెంట్గా ఎన్టీఆర్ బర్త్ డే రోజు చిత్రంలో ఎన్టీఆర్ (NTR) ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్ సినిమాతో చాలా మంది ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వచ్చాయి. కేజీఎఫ్‌లో దయా (Daya) పాత్రలో నటించిన తారక్ పొన్నప్ప ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడట. దేవర సినిమాలో తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో జరుగుతున్న షూట్లో వారం పాటు తారక్ పాల్గొన్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఆయన ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు వెల్లడించారట. దేవర సినిమా కోసం ఆడిషన్ చేశారని.. అందులో తారక్ పొన్నప్ప (Thaarak Ponnappa) ప్రధాన పాత్ర చేస్తున్నానని.. సినిమా సెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాడట. దేవర సెట్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ తోపాటు ఆ సినిమాలో విలన్ అయిన సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)ని కలిశాడట. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెట్స్‌కు వెళ్లాడని.. తారక్‌ని కలవడం ఆనందంగా ఉందంటున్నాడట ఈ కేజీఎఫ్ దయా.