పచ్చి అబద్ధాలను వాట్సప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేసి జనం మెదళ్లను కలుషితం చేసిన భారతీయ జనతా పార్టీ(BJP) ఆ తర్వాత సినిమాల ద్వారా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నది. తమ సానుభూతిపరులతో సినిమాలు తీయిస్తూ వెళుతోంది. ఏదో రకంగా ప్రజల మనసులలో విషబీజాలు నాటాలన్నది ఆ పార్టీ పన్నాగం. ఇలాంటి సినిమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ప్రమోట్ చేయడం బహు విచిత్రం.
పచ్చి అబద్ధాలను వాట్సప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేసి జనం మెదళ్లను కలుషితం చేసిన భారతీయ జనతా పార్టీ(BJP) ఆ తర్వాత సినిమాల ద్వారా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నది. తమ సానుభూతిపరులతో సినిమాలు తీయిస్తూ వెళుతోంది. ఏదో రకంగా ప్రజల మనసులలో విషబీజాలు నాటాలన్నది ఆ పార్టీ పన్నాగం. ఇలాంటి సినిమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ప్రమోట్ చేయడం బహు విచిత్రం. ఆ మధ్యన ది కేరళ స్టోరీ అనే సినిమా వచ్చింది. హిజాబ్(Hijab), లవ్ జిహాద్(Love jihad) చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. లవ్ జిహాద్ ద్వారా కేరళకు చెందిన 32 వేల మందిని ముస్లిం మతంలోకి మార్చి, సిరియాకు తరలించారనే సినిమా ప్రమోషన్స్‌లో చెప్పుకున్నారు. ఇదంతా పచ్చి అబద్ధమంటూ కేరళ ప్రజలు తిట్టిపోయడమే కాకుండా న్యాయస్థానం కూడా మేకర్స్‌పై అక్షింతలు వేయడంతో 32 వేల మంది అన్నది అవాస్తవమని, ప్రచారంలోంచి తొలగిస్తామని చెప్పుకోవాల్సి వచ్చింది. కాకపోతే అప్పటికే వారి లక్ష్యం నెరవేరింది. ఈ సినిమా నిరుడు మే 5వ తేదీన విడులయ్యింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని, జనం సినిమా చూసి మారిపోతారని ఊహించిన వారికి నిరాశే ఎదురయ్యింది. సినిమా పోయింది. ఇప్పుడేమిటీ చేయడం అని ఆలోచించిన బీజేపీ ఆ సినిమాను దూరదర్శన్‌లో ప్రసారం చేయాలని అనుకుంది. ఇలాగైనా కేరళలో కొన్ని ఓట్లు పడతాయన్నది ఆ పార్టీ భావన. దూరదర్శన్ తీసుకున్న నిర్ణయంతో తమకు ఏమిటి సంబంధం అని బీజేపీ అంటే అనొచ్చు కానీ, దూరదర్శన్ ఎవరి చెప్పుచేతల్లో నడుస్తున్నదన్న విషయం మనకు తెలియదా? దూరదర్శన్‌లో ఈ సినిమాను ప్రసారం చేయాలనే ఆలోచనను కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తప్పుపట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మత విద్వేషాలు, ఉద్రిక్తతలను పెంచడానికి బీజేపీ వేసిన ఎత్తుగడ అని ఆయన అన్నారు. సినిమా ప్రసారాన్ని నిలిపేయాలని సీఎం విజయన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌ను కోరారు.