మహానటితో(Mahanati) తెలుగు ప్రేక్షకులకు, ఆ మాటకొస్తే దక్షిణాది ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి కీర్తి సురేశ్‌(Keerthy Suresh).. సావిత్రి(Savitri) పాత్రను పోషించడం సాహసమే అయినా, ఆ పాత్రలో జీవించి ప్రశంసలు అందుకున్నారు కీర్తి సురేశ్. ఇప్పుడామె బిజీ నటి. ఇటీవలే నాచురల్‌ స్టార్‌ నాని(NANI) నటించిన దసరా(Dasara) సినిమాలో అద్భుతంగా నటించారు కీర్తి. ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం తమిళంలో ఆమె నటించిన మామన్నన్‌(Mamannan) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మహానటితో(Mahanati) తెలుగు ప్రేక్షకులకు, ఆ మాటకొస్తే దక్షిణాది ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి కీర్తి సురేశ్‌(Keerthy Suresh).. సావిత్రి(Savitri) పాత్రను పోషించడం సాహసమే అయినా, ఆ పాత్రలో జీవించి ప్రశంసలు అందుకున్నారు కీర్తి సురేశ్. ఇప్పుడామె బిజీ నటి. ఇటీవలే నాచురల్‌ స్టార్‌ నాని(NANI) నటించిన దసరా(Dasara) సినిమాలో అద్భుతంగా నటించారు కీర్తి. ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం తమిళంలో ఆమె నటించిన మామన్నన్‌(Mamannan) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెల్వి మారన్‌(Selvi Maran) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరో ఉదయనిధి స్టాలిన్‌. ఇటీవల ఆ సినిమా ఆడియో రిలీజ్‌ అయ్యింది. ఆ ఫంక్షన్‌లోనూ కీర్తి పాల్గొన్నారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న భోళాశంకర్‌లో(Bholashankar) కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన వేదాళంకు(Vedalam) ఇది రీమేక్‌. తమిళంలో అజిత్‌(Ajith) పోషించిన పాత్రను తెలుగులో చిరంజీవి వేస్తున్నారు.

ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో జరిగింది. ఈ చిత్రానికి మెహర్‌ రమేశ్‌(Mehar Ramesh) దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) కనిపించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కీర్తి సురేశ్‌ సిటీలో తిరిగారు. కాని ఎవరూ ఆమెను గుర్తుపట్టలేదు. తన ఫ్రెండ్స్‌తో కలిసి గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌కు వచ్చి టిఫిన్‌ కూడా చేశారు. తర్వాత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇష్టమైన తందూరీ టీ తాగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కీర్తి సురేశ్‌ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశారు. బయట తనను ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్‌ ధరించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated On 12 Jun 2023 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story