సినిమా ఇండస్ట్రీకి సెంటిమెంట్లు ఎక్కువ. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే చాలు ఎంత టాలెంట్ ఉన్నా వారిని దేకను కూడా దేకరు! హీరోయిన్ల మీద అయితే చాలా ఈజీగా నిందలేసేస్తారు. ఒకట్రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆమెపై ఐరన్ లెగ్(Iron Leg) ముద్ర వేస్తారు. ఇక ఆమె పని అయిపోయిందని ప్రచారం చేస్తారు. అయితే అలా ఒకట్రెండు సినిమాల ఫ్లాప్‌లతో హీరోయిన్ల కెరీర్‌ను అంచనా వేయడం ఏ మేరకు సబబో వారే చెప్పాలి. పాపం కీర్తి సురేశ్(Keerthy Suresh) విషయంలో కూడా గతంలో ఇలాగే జరిగింది.
సినిమా ఇండస్ట్రీకి సెంటిమెంట్లు ఎక్కువ. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే చాలు ఎంత టాలెంట్ ఉన్నా వారిని దేకను కూడా దేకరు! హీరోయిన్ల మీద అయితే చాలా ఈజీగా నిందలేసేస్తారు. ఒకట్రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆమెపై ఐరన్ లెగ్(Iron Leg) ముద్ర వేస్తారు. ఇక ఆమె పని అయిపోయిందని ప్రచారం చేస్తారు. అయితే అలా ఒకట్రెండు సినిమాల ఫ్లాప్‌లతో హీరోయిన్ల కెరీర్‌ను అంచనా వేయడం ఏ మేరకు సబబో వారే చెప్పాలి. పాపం కీర్తి సురేశ్(Keerthy Suresh) విషయంలో కూడా గతంలో ఇలాగే జరిగింది. మొదట మలయాళంలో నటించిన కీర్తి సురేశ్ తర్వాత తమిళంలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా కొన్ని విజయవంతమైన సినిమాల్లో నటించారు. తర్వాత తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు.
ఇక్కడ మహానటి(Mahanati) సినిమాతో కీర్తి సురేశ్ తెలుగువారికి అత్మీయ నటిగా మారారు. అందులో అద్భుతంగా నటించినందుకు ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. దాంతో కీర్తి సురేశ్ పని అయిపోయిందని వార్తలు రాశారు కొందరు. అయితే ఇటీవల తెలుగులో నటించిన దసరా సినిమా(Dasara), తమిళంలో నటించిన మామన్నన్(Mamannan) చిత్రం అద్భుతమైన విజయాలు సాధించాయి. దాంతో కీర్తి సురేశ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. లేటెస్ట్‌గా భోళాశంకర్‌లో(Bhola shankar) చిరంజీవి(Tirupati) చెల్లెలుగా నటించారు.
ఇప్పుడు కీర్తి సురేశ్ మళ్లీ బిజీ అయ్యారు. ఇప్పుడు బాలీవుడ్‌లో(Bollywood) కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. నిజానికి గతంలోనే కీర్తి సురేశ్‌కు హిందీ చిత్రాలలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే అప్పుడు బాలీవుడ్‌కు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ఈ అందాల భామను తమిళ యువ దర్శకుడు అట్లీ(Atlee) హిందీ చిత్ర సీమకు తీసుకెళుతున్నాడు. తమిళంలో నటుడు విజయ్ హీరోగా వరుసగా మూడు హిట్ చిత్రాలను తీసిన అట్లీ ఇటీవల బాలీవుడ్‌లో ప్రవేశించాడు. షారూక్‌ఖాన్(shahrukh khan) హీరోగా జవాన్ అనే భారీ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాతో నటి నయనతారను బాలీవుడ్‌కు పరిచయం చేశాడు అట్లి.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్‌గా అట్లీ బాలీవుడ్‌లో నిర్మాతగా పరిచయం అవుతూ నటి కీర్తి సురేష్‌ను అక్కడకు తీసుకెళ్తున్నారు. తమిళంలో విజయ్ హీరోగా ఆయన తెరకెక్కించిన తెరి(Theri) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో విజయ్ పాత్రను వరుణ్ ధావన్(Varun Dhawan) పోషించనున్నారట! అలాగే నటి సమంత పాత్రలో కీర్తి సురేష్(Keerthy suresh) నటించనున్నారని సమాచారం. కాగా ఎమీజాక్సన్ పాత్రలో నటి వామిక గబ్బిని(vamika Gabbi) ఎంపిక చేశారట! ఈ సినిమాకు కలీస్ దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో జీవా హీరోగా కీ చిత్రానికి దర్శకత్వం వహించింది కలీసే!