కీర్తి సురేష్ నటనకు దక్షిణాదిన ఎంతో మంది అభిమానులు

కీర్తి సురేష్ నటనకు దక్షిణాదిన ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆమె హోమ్లీ పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ను గ్లామర్ రోల్స్ లో చూసింది చాలా తక్కువ. అలాంటిది కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్ అంటే.. ఆమెను ఇన్నాళ్లూ ఆరాధించిన వారి మనోభావాలు దెబ్బ తినవూ!! ప్రస్తుతం అభిమానులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి వైరల్ అవుతూ ఉంది.

నటిగా ఆమె అరంగేట్రం చేసిన పదేళ్లకు మొట్టమొదటి బాలీవుడ్ చిత్రంలోకి అడుగు పెట్టనుంది. బేబీ జాన్ పేరుతో రూపొందుతున్న సినిమాలో వరుణ్ ధావన్ సరసన కీర్తి నటించనుందని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకు సంబంధించి మరిన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. నివేదికల ప్రకారం, కీర్తి.. వరుణ్‌ ధావన్ తో ఒక సన్నివేశం కోసం లిప్-లాక్‌ ఇవ్వనుంది. లిప్-లాక్ సన్నివేశాలకు సంబంధించి మొదటి నుండి కీర్తి నో చెబుతూ వస్తోంది. మొదటి సారి కీర్తి సురేష్ నో ఆన్-స్క్రీన్ కిస్ పాలసీని బ్రేక్ చేయనుంది.

Updated On 24 May 2024 1:10 AM GMT
Yagnik

Yagnik

Next Story