రిలేషన్‏షిప్(Relation ship), పెళ్లి(Marriage) వంటి విషయంలో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. కొద్ది రోజుక్రితం ఓ అబ్బాయితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేయడంతో ఇంకేముంది ఈ భామ పెళ్లికి సిద్ధమైందని ఓ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ రూమర్స్‏పై రియాక్ట్ అయిన కీర్తి.. ఆ ఫొటోలో ఉన్న పర్సన్ తన స్నేహితుడంటూ చెప్పుకొచ్చింది.

రిలేషన్‏షిప్(Relation ship), పెళ్లి(Marriage) వంటి విషయంలో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. కొద్ది రోజుక్రితం ఓ అబ్బాయితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేయడంతో ఇంకేముంది ఈ భామ పెళ్లికి సిద్ధమైందని ఓ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ రూమర్స్‏పై రియాక్ట్ అయిన కీర్తి.. ఆ ఫొటోలో ఉన్న పర్సన్ తన స్నేహితుడంటూ చెప్పుకొచ్చింది. అయితే నా మనసులో ఉన్న ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో కూడా బయటపెడతానని చెప్పింది మహానటి. తాజాగా ఈ బ్యూటీ తన ఫ్రెండ్‏తో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి లాంగ్ బాయ్ ఫ్రెండ్ అని.. వాళ్లు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని పలువురు చెవులుకొరుక్కుంటున్నారు. అయితే ఈ వార్తలపై ఆమె ట్విటర్ వేదికగా రియాక్ట్ అయింది. హా.. హా.. హా.. అని నవ్వుతూ.. నా బెస్ట్ ఫ్రెండ్‏ని ఈ ఇష్యూలోకి లాగాల్సిన అవసరం లేదని.. ఆ మిస్టరీ త్వరలోనే రివీల్ అవుతుందని.. అప్పటి వరకు చిల్‏గా ఉండండి అంటూ చెప్పింది కీర్తి సురేష్.

ఇక కీర్తి సురేష్ లవ్ ఎఫైర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఆమె దుబాయ్‏కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్‏ను పెళ్లి చేసుకోబోతుందని, ఆమె చిన్ననాటి ఫ్రెండ్‏తో రిలేషన్‏లో ఉన్నట్టు.. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్‏తో ప్రేమలో ఉన్నట్టు కొన్నిరోజులు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలో ఏ ఒక్కటి కూడా నిజం కాదని తేలిపోయింది. ఇదిలా ఉంటే సుమన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న రఘు థాథా (Raghu Thatha) చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. 1981లో కె. భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్రు పోయి నాలాయ్ వా (Indru Poi Naalai Vaa) సినిమాలోని ఐకానిక్ లైన్ ‘ఏక్ గామ్ మే కిషన్ రఘు థా’ నుంచి ఇన్‏స్పిరేషన్‏తో ఈ మూవీ టైటిల్‏ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది వెన్నెల.

Updated On 23 May 2023 2:46 AM GMT
Ehatv

Ehatv

Next Story