మహానటి(Mahanati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత అత్మీయురాలైన నటిగా మారిన కీర్తి సురేశ్‌(Keerthy Suresh) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని, దుబాయ్‌కు(Dubai) చెందిన వ్యాపారవేత్తతో(Businessman) సంబంధం సెట్‌ అయిందన్న వార్త ఆ మధ్య సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.

మహానటి(Mahanati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత అత్మీయురాలైన నటిగా మారిన కీర్తి సురేశ్‌(Keerthy Suresh) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని, దుబాయ్‌కు(Dubai) చెందిన వ్యాపారవేత్తతో(Businessman) సంబంధం సెట్‌ అయిందన్న వార్త ఆ మధ్య సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఈ వార్తలపై కీర్తి సురేశ్‌ తల్లిదండ్రులు స్పందించారు. కీర్తికి పెళ్లి చేసే సమయంలో అందరికీ చెప్పే చేస్తామని వారు చెప్పారు. ఇదే విషయాన్ని కీర్తి సురేశ్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. దాంతో అప్పుడు ఆ వార్తలకు బ్రేక్‌ పడింది. లేటెస్ట్‌గా కీర్తి సురేశ్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. రెడ్‌ కలర్‌ డ్రెస్‌లో(Red Dress) కీర్తి సురేశ్‌ నవ్వుతూ ఉంటే, ఆమెతో పాటు ఓ వ్యక్తి ఎంతో సన్నిహితంగా ఫోటోలో కనిపించాడు. ఇంకేముందు ప్రస్తుతం ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేనా... ఆ ఫోటోకు క్యాప్షన్‌గా మెకానిక్‌తో(Mechanic) కీర్తి ప్రేమాయణం అంటూ కథలు కూడా అల్లారు. ఈ ఫోటో విషయంపై కీర్తి ఫ్యాన్స్‌ మాత్రం మండిపడుతున్నారు. సినిమా షూటింగ్‌ సమయంలో ఎవరితోనైనా ఒక్క ఫోటో దిగితే ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తారా అంటూ గరమవుతున్నారు. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయంటూ మండిపడుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వస్తున్న భోళాశంకర్‌(Bholashankar) సినిమా షూటింగ్‌ టైమ్‌లో కీర్తి సురేశ్‌ ఓ టెక్నిషియన్‌(Technician) ఫోటో దిగాడని, దానికి పట్టుకుని అసభ్యంగా ప్రచారం చేయడం ఏమిటని ఆమె ఫ్యాన్స్‌ నిలదీస్తున్నారు. మరోసారి కీర్తి సురేశ్‌పై ఇలాంటి ప్రచారాలు చేస్తే పోలీసులకు కంప్లయింట్‌ చేస్తామని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అల్టిమేటమ్‌ ఇచ్చారు.

Updated On 23 Jun 2023 2:46 AM GMT
Ehatv

Ehatv

Next Story