మనిషన్నవారికి ఆటుపోట్లు సహజం. కలిమి మిగలదు. లేమి మిగలదు. కలకాలం ఒక రీతి గడవదు అని ఓ కవి అన్నట్టుగానే మనిషి జీవితంలో ఏదీ నిరంతరం కాదు. గెలుపోటములు కూడా అంతే! అపజయాలకు కుంగిపోవడం, విజయాలకు పొంగిపోవడం మానవుడి సహజ లక్షణం. సినీ నటి కీర్తి సురేశ్(Keerthy Suresh) చాలా తక్కువ సమయంలో అగ్ర కథనాయిక స్థానానికి చేరుకున్నారు.

Keerthy Suresh
మనిషన్నవారికి ఆటుపోట్లు సహజం. కలిమి మిగలదు. లేమి మిగలదు. కలకాలం ఒక రీతి గడవదు అని ఓ కవి అన్నట్టుగానే మనిషి జీవితంలో ఏదీ నిరంతరం కాదు. గెలుపోటములు కూడా అంతే! అపజయాలకు కుంగిపోవడం, విజయాలకు పొంగిపోవడం మానవుడి సహజ లక్షణం. సినీ నటి కీర్తి సురేశ్(Keerthy Suresh) చాలా తక్కువ సమయంలో అగ్ర కథనాయిక స్థానానికి చేరుకున్నారు. అదే సమయలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. సీనియర్ నటి మేనక(Menaka), సురేశ్(Suresh) దంపతుల కూతురు అయిన కీర్తి సురేశ్ బాలనటిగా తెరకు పరిచయం అయ్యారు. గీతాంజలి(Geethaanjali) అనే మలయాళ సినిమాతో హీరోయిన్ అయ్యారు. ఇక తమిళంలో ఆమె మొదటి సినిమా ఇదు ఎన్న మాయం(Idhu Enna Maayam) ఎ.ఎల్.
విజయ్(AL Vijay) దీనికి దర్శకుడు. ఈ సినిమా ఆశించినమేర విజయం సాదించలేకపోయింది. కాకపోతే నటిగా కీర్తి సురేశ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పొన్రమ్ దర్శకత్వంలో వచ్చిన రజనీమురుగన్(Rajnimurugan) సినిమా విజయవంతం అయ్యింది. తెలుగులో నేను శైలజ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో లేడి ఓరియెంటెడ్ కథా చిత్రాల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇలాంటి దశలో మరింత స్లిమ్‌గా తయారవ్వడానికి జిమ్‌లో చాలా కష్టపడ్డారు. అప్పుడు అనేక విమర్శలకు గురయ్యారు. కీర్తి సురేశ్ ముఖంలో గతంలో ఉన్న గ్లామర్ పోయిందని, ఇక ఆమె చాప్టర్ క్లోజ్ అని కామెంట్స్ వచ్చాయి. అలాంటి టైమ్‌లోనే అదే ముఖంతో తమిళంలో సాని కాగితం(Saani Kaayidham)అనే చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తెలుగులో మాత్రం మహానటి(Mahanati) తర్వా ఆమె నటించిన చిత్రాలు అంతగా ఆడలేదు. ఆ తర్వాత కీర్తి సురేశ్ సరికొత్త అందాలను సంతరించుకున్నారు.
వరుస విజయాలను అందుకున్నారు. ఇప్పుడామె తీరిక లేని నటి. తెలుగులో నాని సరసన నటించిన దసరా(Dasara) సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే లేటెస్ట్‌గా తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన మామన్నన్(Mamannan) బ్రహ్మండమైన విజయాన్ని అందుకుంది. తెలుగులో నాయకుడు పేరుతో విడుదల చేశారు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeeviki) చెల్లెలుగా నటించిన భోళాశంకర్(Bholashankar) సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదలకాబోతున్నది. తమిళంలో జయం రవితో(Jayam Ravi) సైరన్(Siren), రఘుతాత చిత్రాలలో నటిస్తున్నారు. రఘుతాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం.
