ఈక్రమంలో పెళ్ళి తరువాత తన రెమ్యునరేషన్ పెంచేసిందట మలయాళ బ్యూటీ.

రీసెంట్ గా పెళ్ళి చేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఇకపై కూడా సినిమాలు కొనసాగించబోతోంది. ఈక్రమంలో పెళ్ళి తరువాత తన రెమ్యునరేషన్ పెంచేసిందట మలయాళ బ్యూటీ.

సౌత్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్ కీర్తి సురేష్. మహానటిసినిమాతో ఆమె నేచురల్ స్టార్ గామారిపోయింది. సావిత్రి పాత్రవల్ల కీర్తి సురేష్ కు మహానటి అన్నబిరుదు కూడా వచ్చింది. సౌత్ లో మహేష్ బాబు, శివకార్తికేయన్, విజయ్ లాంటి స్టార్స్ తో నటించిన కీర్తి.. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించబోతోంది.

ఇన్నాళ్లు దక్షిణాదికే పరిమితం అయిన కీర్తి సురేష్(Keerthy Suresh)టాలెంట్ ను బాలీవుడ్ లో కూడా చూపించబోతుంది. సౌత్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. బేబీ జాన్ సినిమాతో నార్త్ అడియన్స్ ముందుకు వస్తుంది. ఈసినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.

బేబీ జాన్ సినిమాతో తొలిసారి ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటి వరకు కీర్తి నటించిన సినిమా పెద్దగా హిందీలో రిలీజ్ కాలేదు. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగతున్నాయి. అయితే ఈ సినిమా కోసం కీర్తి గట్టిగానే డిమాండ్ చేసిందట. అంతే కాదు పెళ్లి తరువాత ఆమె తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందని టాక్.

రీసెంట్ గా అంటే డిసెంబర్ 12న కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీతో మూడు ముళ్లు వేయించుకుంది. ఇక పెళ్లి తరువాత కూడా కెరీర్ ను కొనసాగించబోతుంది కర్తి. ఇక గతంలో సినిమాకు కోటి నుంచికోటిన్నర వరకూ మాత్రమే తీసుకునే కీర్తి సురేష్ ఇక బాలీవుడ్ లో బిజీ అయితే 4 నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తుందట.

ఇక ప్రస్తుతం కీర్తి నటిస్తున్న బేబి జాన్ సినిమాకు తమిళంలో విజయ్ దళపతి నటించిన తేరీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి దర్శకుడు అట్లీ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Updated On 18 Dec 2024 11:01 AM GMT
ehatv

ehatv

Next Story