అలాగే తెలుగులో నాని హీరోగా వచ్చిన దసరా(Dasara) సినిమాలో నటించారు. అందులో పల్లెటూరి అమ్మాయిగా చక్కగా నటించారు. కొన్ని చిత్రాల్లో గ్లామర్‌ పాత్రలు పోషించినా అవి కీర్తి సురేశ్‌కు సెట్‌ అవ్వలేదు. గ్లామర్‌ పాత్రలు ఆమెకు సరిపడవు అన్న విమర్శలు కూడా వున్నాయి. ఆ విమర్శల్లో పసలేదని చాటి చెప్పడానికి ఆమె గ్లామర్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

కీర్తి సురేశ్‌(Keerthy Suresh) అంటే చటుక్కున మనకు గుర్తుకొచ్చేది మహానటి(Mahanati) సినిమా! మహానటి సావిత్రి(Savitri) పాత్రలో చక్కగా ఇమిడిపోయి గొప్పగా నటించారు కీర్తి సురేశ్‌. అంతకు ముందు సినిమాలు ఉన్నా మహానటితో కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు. జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. నటనకు కేరాఫ్‌ అడ్రస్‌ కీర్తి సురేశ్‌ అంటే అతిశయోక్తి కాదేమో! ఆమె అదృష్టం కొద్ది ఆమెకు నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలే వస్తున్నాయి. కొన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించి అందరిని మెప్పించారు. ఇటీవల తమిళంలో వచ్చిన సాని కాగితం(Sani Kagitham) సినిమాలో కీర్తి సురేశ్‌ నటన అద్బుతంగా ఉంది. ఆ సినిమాలో ఆమె నవరసాలను పండించారు.

అలాగే తెలుగులో నాని హీరోగా వచ్చిన దసరా(Dasara) సినిమాలో నటించారు. అందులో పల్లెటూరి అమ్మాయిగా చక్కగా నటించారు. కొన్ని చిత్రాల్లో గ్లామర్‌ పాత్రలు పోషించినా అవి కీర్తి సురేశ్‌కు సెట్‌ అవ్వలేదు. గ్లామర్‌ పాత్రలు ఆమెకు సరిపడవు అన్న విమర్శలు కూడా వున్నాయి. ఆ విమర్శల్లో పసలేదని చాటి చెప్పడానికి ఆమె గ్లామర్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేశ్‌కు పది లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఫాలోయింగ్‌ను పెంచుకోవడం కోసమో, అవకాశాల కోసమో తెలియదు కానీ ఈ మధ్యన ఫోటో సెషన్‌లో(Photo session) ఎక్కువగా పాల్గొంటున్నారు. అందాలను ఎక్స్‌పోజ్‌ చేస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. చూద్దాం.. ఈ రకంగా అయినా ఆమెకు గ్లామర్‌ రోల్స్‌ వస్తాయేమో!

Updated On 30 May 2023 1:50 AM GMT
Ehatv

Ehatv

Next Story