మహానటి సినిమాతో ఎంత పెద్ద పేరు వచ్చినా.. ఆతరువాత అన్నీ ప్లాప్ లే వచ్చాయి కీర్తికి. ఇక ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ నటన ఆ రేంజ్ సినిమా అంటే రీసెంట్ గా వచ్చిన దసరా (dasara)సినిమా అనే చెప్పాలి. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటన అద్భుతం అని చెప్పాలి. మరో రకంగా చెప్పాలంటే.. నటించింది అనడం కంటే జీవించింది అనొచ్చు.
కీర్తి సురేష్ (keerthy suresh)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి మలయాళ హీరోయిన్ అయినా కూడా....తెలుగింటి అమ్మాయిల.. కనిపిస్తుంది. నటనలో కూడా ఆమె తీరు వేరు. రామ్ హీరోగా నటించిన నేను శైలజా(nenu sailaja)సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. అప్పటి నుంచిపద్దతిగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఇక మహానటి (mahanati)తరువాత కీర్తి సురేష్ లైఫ్ టర్న్ అయ్యింది.
మహానటి సినిమాతో ఎంత పెద్ద పేరు వచ్చినా.. ఆతరువాత అన్నీ ప్లాప్ లే వచ్చాయి కీర్తికి. ఇక ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ నటన ఆ రేంజ్ సినిమా అంటే రీసెంట్ గా వచ్చిన దసరా (dasara)సినిమా అనే చెప్పాలి. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటన అద్భుతం అని చెప్పాలి. మరో రకంగా చెప్పాలంటే.. నటించింది అనడం కంటే జీవించింది అనొచ్చు.
ప్రస్తుతం కీర్తి చేతిలో నాలుగైదు సినిమాలకు పైనే ఉన్నాయి. ఆమె రెమ్యూనరేషన్(remuneration) కూడా కోట్లలో ఉంటుంది. ఇప్పుడు కోట్లరూపాయల రెమ్యనరేషన్ తీసుకుంటున్న కీర్తి సురేష్.. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు. కీర్తి చిన్నప్పటి నుంచి నటిస్తుంది. తల్లీ తండ్రులు నటీనటులే కావడంతో.. కీర్తి బాలనటిగా(child artist) మలయాళంలో మూడు సినిమాలు చేసింది. కాగా బాలనటిగా కీర్తి సురేష్ తొలి పారితోషికం 500 తీసుకుందట.
ఇక మరో విషయం ఏంటంటే.. ఆ విషయం స్వయంగా కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్(suresh kumar) వెల్లడించాడు.తండ్రి ప్రొడ్యూసర్,(producer) తల్లి నటి ఇలా కీర్తి తల్లిదండ్రులిద్దరూ సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఆమె సినీ పరిశ్రమలోకి రావడం చాలా తేలికైంది. కానీ తన నటన, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా కీర్తి తొలిసారి 2000లో పైలట్స్ (pilots)అనే సినిమాలో కెమెరా ముందుకు వచ్చింది.
అయితే కీర్తి తన తొలి పారితోషికం కూడా తన తండ్రి నుంచే అందుకుందట. ఎందుకుంటే ఈ సినిమాను నిర్మించింది కీర్తి సురేష్ తండ్రే. కాగా ఈ సినిమాలో నటించినందుకు సురేష్.. కీర్తికు 500 ఇచ్చాడట. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన రెండు సినిమాలు కూడా కీర్తి సురేష్ తండ్రి ప్రొడ్యూస్ చేసినవే. ఇక ప్రస్తుతం కీర్తి ఒక్కో సినిమాను 2 నుంచి 3 కోట్ల రేంజ్‌లో పారితోషికం తీసుకుంటుందట.