తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదని చెబుతున్నారు కావ్య కల్యాణ్‌రామ్(Kavya Kalyan Ram). సావిత్రి, వాణిశ్రీ, శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి తెలుగు హీరోయిన్లు ఎన్నో విజయాలను సాధించారని, దేశవ్యాప్తంగా చూస్తే వారి కంటే సక్సెస్‌ను ఎవరూ చూడలేదని ఆమె అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదని చెబుతున్నారు కావ్య కల్యాణ్‌రామ్(Kavya Kalyan Ram). సావిత్రి, వాణిశ్రీ, శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి తెలుగు హీరోయిన్లు ఎన్నో విజయాలను సాధించారని, దేశవ్యాప్తంగా చూస్తే వారి కంటే సక్సెస్‌ను ఎవరూ చూడలేదని ఆమె అన్నారు. తన విషయానికి వస్తే తెలుగు అమ్మాయిని కావడం ప్లస్ పాయింట్ అని తెలిపారు. కోడూరి శ్రీ సింహ(Koduri Sri Simha), కావ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఉస్తాద్(Ustad) సినిమా ఈ నెల 12న విడుదల కాబోతున్నది. దీనికి ఫణిదీప్(Phanideep) దర్శకత్వం వహించాడు.
రజనీ కొర్రపాటి, గడ్డం రాకేశ్ రెడ్డి, దువ్వూరు హిమాంక్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఉస్తాద్‌లో సూర్య అనే పాత్రలో శ్రీ సింహ కనిపిస్తారని, తన బైక్‌ను ఉస్తాద్ అని పిలుచుకుంటాడని కావ్య తెలిపారు. ఇందులో సూర్య ప్రేయసి మేఘనగా తాను నటించానని చెప్పారు. ' నా పాత్ర నేటి తరం అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. ఇవాళ రజనీకాంత్‌గారి జైలర్, శుక్రవారం చిరంజీవిగారి భోళా శంకర్, శనివారం మా ఉస్తాద్ రిలీజవుతున్నాయి. ఆ ఇద్దరు లెజెండ్స్ సినిమాలను చూసే ప్రేక్షకుల్లో సగం మంది అయినా మా సినిమాను చూస్తే చాలు. మా సినిమా హిట్ అవుతుంది' అని కావ్య కల్యాణ్‌రామ్ చెప్పుకొచ్చారు. బాలనటిగా పలు చిత్రాలలో నటించిన కావ్య, మసూద, బలగం సినిమాలతో హీరోయిన్‌గా విజయాలను అందుకున్నారు.