బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకొనే(Deepika Padukone) త్వరలో పండంటి పాపకో, బాబుకో జన్మనివ్వబోతున్నది. తాను గర్భవతిననే శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. రీసెంట్‌గా బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ(Anushka Sharma) కూడా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకొనే(Deepika Padukone) త్వరలో పండంటి పాపకో, బాబుకో జన్మనివ్వబోతున్నది. తాను గర్భవతిననే శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. రీసెంట్‌గా బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ(Anushka Sharma) కూడా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు మరో టాప్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌(Katrina kaif) కూడా తల్లి కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. విక్కీ కౌశల్‌(Vickey kaushal) ఇల్లు త్వరలో చిన్నారి కేరింతలతో కళకళలాడబోతున్నదట! ముఖేశ్‌ అంబానీ(Mukesh ambani) కుమారుడు అనంత్‌ అంబానీ(Ananth ambani), వీరేన్‌ మర్చంట్‌(Veeren marchant) కూతురు రాధిక(Radhika) మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌(Pre wedding) వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన విషయం విదితమే కదా! ఆ వేడుకలకు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ దంపతులు కూడా వెళ్లారు. అక్కడ ఆమె తన కడుపును దుపట్టాతో పదే పదే దాచుకోవడం కనిపించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ వివాహం 2021, డిసెంబర్‌లో జరిగింది. మూడేళ్ల తర్వాత వారిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారన్నమాట! అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.

Updated On 5 March 2024 3:12 AM GMT
Ehatv

Ehatv

Next Story