నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాకు(Rashmika Mandanna) సంబంధించిన మార్ఫింగ్‌ వీడియో(Morphing Video) వైరల్‌ కావడంతో డీప్‌ ఫేక్‌(Deep Fake) అనే పదం ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. జారా పటేల్‌(Jara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు సంబంధించిన వీడియోను అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతకతతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు కొందరు దుండగులు.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాకు(Rashmika Mandanna) సంబంధించిన మార్ఫింగ్‌ వీడియో(Morphing Video) వైరల్‌ కావడంతో డీప్‌ ఫేక్‌(Deep Fake) అనే పదం ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. జారా పటేల్‌(Jara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు సంబంధించిన వీడియోను అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతకతతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు కొందరు దుండగులు. ఈ ఘటనతో సినిమా పరిశ్రమ ఉలిక్కిపడింది. చాలా మంది ప్రముఖులు ఈ చర్యను ఖండించారు.

బాధ్యులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అయితే డీప్‌ ఫేక్‌ బాధితురాళ్లలో రష్మిక మొదటి వ్యక్తేమీ కాదు. ఇంతకు ముందు చాలా మంది సెలెబ్రిటీలు ఫేక్‌ వీడియోలతో ఇబ్బందులు పడ్డారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌(Katrina Kaif) కూడా డీప్‌ ఫేక్‌ బాధితురాలే. ఆమెకు సంబంధించిన కొన్ని మార్ఫింగ్‌ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆమె స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌తో(Salman Khan) కలిసి టైగర్‌ 3(Tiger 3) సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఆమె చేసిన టవర్‌ ఫైట్‌ సీన్‌(Towel Fight) అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ హాలీవుడ్‌ స్టంట్ ఉమెన్‌తో కలిసి కత్రినా కైఫ్‌ చేసిన పోరాట దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే కొందరు దుర్మార్గులు ఆ సీన్లను మిస్‌యూజ్‌ చేశారు. సినిమాలో కత్రినా కైఫ్‌ టవల్‌ కట్టుకుని ఫైట్ చేస్తారు. అయితే ఏఐ(AI) సాంకేతికతో వాటిని మార్ఫింగ్‌ చేశారు. డీప్‌ ఫేక్‌ ఫోటోల్లో కత్రినా లోదుస్తులలో ఫైట్‌ చేస్తున్నట్టు చూపించారు. ఈ దృశ్యాలు చూసి బాలీవుడ్‌ దిగ్భ్రాంతికి లోనయ్యింది. సామాజిక మాధ్యమాల నుంచి ఆ దృశ్యాలను తొలగించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు కొందరు ప్రముఖులు.

ఇక టైగర్‌ 3 సినిమా విషయానికి వస్తే మనీశ్‌ శర్మ దీనికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలో కత్రినా కైఫ్‌పై వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా టవల్‌ ఫైట్‌ సీన్‌ ఇప్పటి వరకు చూసి ఉండరు. హాటెస్ట్‌ ఫైట్‌ సీన్‌గా నిలిచిపోవడం ఖాయమని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఈ సినిమాలో షారూక్‌ఖాన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విలన్‌గా ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్నాడు. అలనాటి అందాల తార రేవతి లాంగ్ గ్యాప్‌ తర్వాత మరోసారి సల్మాన్‌ ఖాన్‌తో కలిసి నటిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 12న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతున్నది.

Updated On 7 Nov 2023 6:54 AM GMT
Ehatv

Ehatv

Next Story