నటి కస్తూరి గుర్తున్నారా? గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పెద్దగా సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా ఆక్టివ్ గా ఉంటారు.
నటి కస్తూరి గుర్తున్నారా? గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పెద్దగా సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా ఆక్టివ్ గా ఉంటారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు.
తమిళనాడు బీజేపీ నాయకురాలైన కస్తూరి లేటెస్టుగా బీజేపీ సభలో ద్రావిడ సిద్దాంత వాదులను, వారి ఐడియాలజీని ప్రశ్నించారు. ఆ క్రమంలో తమిళనాడులోని బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడారు . అలాగే తెలుగు వారిని కించ పరిచారు.
రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని చెబుతూ, అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంత:పుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. ఇప్పుడు వారు తమది తెలుగు జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ కస్తూరి ప్రశ్నించింది.ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో అయిదుగురు తెలుగు మాట్లాడే మంత్రులున్నారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దు. ఇతర భార్యలపై మోజుపడవద్దు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇలా మంచి మాటలు చెబుతున్నారు కాబట్టే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది అని కస్తూరి వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కస్తూరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ,తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.